56 కార్లు, ట్రక్కులు ఒకేచోట ఢీకొన్నాయి, 17 మంది మృతి
చైనాలోని ఓ హైవే పైన ఏకంగా 56 వాహనాలు ఢీకొన్నాయి. ఈ దారుణమైన సంఘటన చైనాలోని షాంగ్జీ ప్రావిన్సులో బీజింగ్ - కున్‌మింగ్ హైవే పైన చోటు చేసుకుంది.
బీజింగ్: చైనాలోని ఓ హైవే పైన ఏకంగా 56 వాహనాలు ఢీకొన్నాయి. ఈ దారుణమైన సంఘటన చైనాలోని షాంగ్జీ ప్రావిన్సులో బీజింగ్ - కున్‌మింగ్ హైవే పైన చోటు చేసుకుంది. రోడ్డు అంతా దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో కార్లు, భారీ వాహనాలు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో పదిహేడు మంది మృతి చెందారు. చాలామంది గాయపడ్డారు. విషయం తెలియగానే పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన పలు వాహనాల్లో మంటలు చెలరేగాయి. వాటిని అదుపు చేశారు.

రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం సోమవారం నాడు ఉదయం తొమ్మిది గంటలకు జరిగింది. ఢీకొన్న 56 వాహనాలలో కార్లు, ట్రక్కులు ఉన్నాయి. సహాయక చర్యలకు పన్నెండు గంటలు పట్టింది. చాలా వాహనాలు పెద్ద మొత్తంలో దెబ్బతిన్నాయి.












Click it and Unblock the Notifications