వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంగారమే వర్షంగా: విమానం నుంచి జారిపడిన 3.4టన్నుల గోల్డ్(వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

బంగారమే వర్షంగా: విమానం నుంచి జారిపడిన గోల్డ్..!!

మాస్కో: అవును అక్కడ బంగారమే వర్షంగా కురిసింది. ఓ విమానం నుంచి ఏకంగా కిలోల కొద్ది బంగారం, అత్యంత విలువైన ప్లాటినం దిమ్మలు రన్ వే పై పడింది. ఈ ఘటన వజ్రాలు, బంగారు గనులకు నిలయమైన రష్యాలోని యకుతియా ప్రాంతంలో చోటు చేసుకుంది.

3 tonnes of gold spills on runway after plane door glitch

వివరాల్లోకి వెళితే.. యకుస్క్‌ విమానాశ్రయంలో నింబూస్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే వస్తువులు తరలించే విభాగం తలుపులు తెరచుకున్నాయి. దీంతో బంగారం దిమ్మలు, ప్లాటినం, విలువైన రత్నాలు జలజలా రన్‌వేపై జారిపడ్డాయి.

కాగా, ఆ పరిసరాల్లో ఎవరూ లేకపోవడంతో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. విమానాన్ని సిబ్బంది జాగ్రత్తగా కిందకు దించగలిగారు. దీనికి సంబంధించిన చిత్రాలు ఇంటర్నెల్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఈ ఘటన వాస్తవమేనని రష్యా దర్యాప్తు బృందం గురువారం స్పష్టీకరించింది. పరిసరాల్లోని చికోత్కా ప్రాంతానికి చెందిన ఓ గనులు తవ్వే సంస్థ బంగారాన్ని తరలిస్తుండగా ప్రమాదవశాత్తు విమానం తలుపులు తెరుచుకున్నట్లు వెల్లడించింది. మొత్తంగా 3.4 టన్నుల బంగారం నేలపై పడినట్లు వెల్లడించింది.

English summary
Russian news reports say the hatch of a cargo plane carrying precious metals accidentally flew open upon takeoff - scattering at least 3 tonnes of gold on the runway.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X