H1B వీసాలపై భారతీయ కంపెనీల యూటర్న్..! కీలక కారణాలివే..!
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హెచ్1బీ వీసాల విషయంలో కంపెనీలపై పెడుతున్న ఒత్తిడి నానాటికీ తీవ్రమవుతోంది. ఇప్పటికే కొత్త ఉద్యోగుల్ని తీసుకోవాలంటే హెచ్1బీ వీసాలకు ఏడాదికి లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సిందేనంటూ ట్రంప్ సర్కార్ పెట్టిన నిబంధన పలు సంస్థల్ని ఆలోచనలో పడేసింది. అదే సమయంలో ఇతరత్రా మార్గాల్లో వారిపై అమెరికన్లనే ఉద్యోగాల్లో తీసుకోవాలంటూ పెడుతున్న ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. దీంతో భారతీయ కంపెనీలు పునరాలోచనలో పడుతున్నాయి.
అమెరికాలో పనిచేస్తున్న భారతీయ కంపెనీలు హెచ్1బీ వీసాలతో తమ దేశానికి చెందిన నిపుణులకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో వెనకడుగు వేయడం ప్రారంభించాయి. ఈ ఏడాదిలో భారతీయ సంస్థలు గతేడాదితో పోలిస్తే హెచ్1బీ వీసాల్ని 37 శాతం తగ్గించేసుకున్నట్లు బ్లూమ్ బర్గ్ తాజా నివేదిక తెలిపింది. ఇందులో టాప్ 7 భారతీయ కంపెనీలు అయితే ఏకంగా 70 శాతం హెచ్1బీ వీసా దరఖాస్తుల్ని తగ్గించేశాయని గణాంకాలు చెప్తున్నాయి. ఈ లెక్కన చూస్తే భవిష్యత్తులో ఇది 100 శాతానికి కూడా చేరొచ్చని తెలుస్తోంది.

ఈ ఏడాది కేవలం 4573 హెచ్1బీ వీసా దరఖాస్తుల్ని మాత్రమే ఆమోదించినట్లు ట్రంప్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అమెరికా ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరానికి కొత్త హెచ్1బీ వీసా అనుమతులలో అమెరికాకు చెందిన అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ , గూగుల్ వంటి సంస్థలు మిగతా వారి కంటే ముందున్నాయి. అలాగే ఆపిల్ కూడా ఆరో స్థానంలో నిలిచింది. హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తుల్ని తగ్గించేసుకుంటున్న భారతీయ సంస్ధలు ఈ జాబితా నుంచి క్రమంగా బయటికి వచ్చేస్తున్నాయి. దీంతో టాప్ 25 స్పాన్సర్లలో మూడు భారతీయ కంపెనీలు మాత్రమే మిగిలి ఉన్నాయి.
ఈ ఏడాదిలో భారతీయ కంపెనీలు హెచ్1బీ వీసాల ద్వారా నియామకాలు తగ్గించుకుంటున్న నేపథ్యంలో సహజంగానే అమెరికా కంపెనీలు ఈ ఉద్యోగాల కల్పనలో ముందుంటున్నాయి. ఈ ఏడాది అమెజాన్‌లో అత్యధికంగా హెచ్1బీ దరఖాస్తులు 4,644 ఆమోదం పొందాయి. ఆ తర్వాత మెటా ప్లాట్‌ఫామ్‌లు (1,555), మైక్రోసాఫ్ట్ (1,394), గూగుల్ (1,050) ఉన్నట్లు యూసిక్స్ గణాంకాలు చెప్తున్నాయి. హెచ్1బీ వీసా దరఖాస్తుల జాబితాలో ఇలా నాలుగు అమెరికా కంపెనీలు టాప్ లో ఉండటం ఇదే తొలిసారి కూడా.

హెచ్1బీ వీసా దరఖాస్తుల్లో భారతీయ కంపెనీల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఐదవ స్థానంలో నిలిచింది. ఎల్టీఐ మైండ్ ట్రీ 20వ స్ధానంలోనూ, హెచ్సీఎల్ అమెరికా 21వ స్థానంలోనూ ఉన్నాయి. మరోవైపు భారతీయ కంపెనీలు అమెరికా ఉద్యోగుల్ని నియమించుకోవడంలో పెరుగుదల కనిపిస్తోంది. సాంకేతికతలో మార్పులు, అమెరికా బయట పని చేయగల సామర్థ్యం కొత్తహెచ్1బీ వీసాల డిమాండ్‌ను తగ్గించాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications