వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా మళ్లీ కాల్పులు: నలుగురు మృతి (వీడియో)

By Pratap
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఎళ్ల వేళలా జనంతో రద్దీగా ఉండే కాస్కేడ్‌ మాల్‌లో శుక్రవారం అకస్మాత్తుగా జరిగిన తుపాకీ పేలుళ్లు భీతావహ వాతావరణాన్ని కల్పించాయి. ఓ అగంతకుడు కాల్పులు జరిపినట్లు వాషింగ్టన్ స్టేట్ పోలీసులు ట్విటర్‌లో తెలిపారు.

ఈ కాల్పుల ఘటనలో నలుగురు మృతి చెందినట్లు తెలిపారు. ఓ అనుమానితుడు పరారయ్యాడని తెలిపారు. గ్రే కలర్ దుస్తులు ధరించిన అగంతకుడి కోసం గాలింపు జరుగుతోందని సార్జంట్ మార్క్ ఫ్రాన్సిస్ చెప్పారు. ఆ నిందితుడిని చివరిసారిగా ఇంటర్‌స్టేట్ 5లో చూసినట్లు తెలిపారు.

ఈ దాడిలో ఎందరు పాల్గొన్నారో స్పష్టంగా చెప్పలేమన్నారు. శుక్రవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగిందన్నారు. మాల్‌లో గాయపడినవారికి చికిత్స చేసేందుకు వైద్యులను పంపించినట్లు తెలిపారు.

కాగా, భద్రతా దళాలు బర్లింగ్టన్ నగరాన్ని చుట్టుముట్టాయి. సోదాలు నిర్వహిస్తున్నాయి. సీటెల్ నగరానికి 105 కిలోమీటర్ల దూరంలోని బర్లింగ్టన్‌లో ఈ మాల్ ఉంది. 1990లో ప్రారంభమైన ఈ మాల్‌లో సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు, మూడు అతిపెద్ద స్టోర్స్ ఉన్నాయి.

నిఘా వీడియోలో రికార్డయిన ఓ స్టిల్‌ను అధికారులు విడుదల చేశారు. ఆ స్టిల్ చేతిలో రైఫిల్ పట్టుకున్నట్లు కనిపిస్తున్న ఓ యువకుడు ఉన్నాడు. అతనే కాల్పులు జరిపి ఉంటాడని అనుమానిస్తున్నారు. పోలీసులకు 6.58 గంటలకు కాల్పులకు సంబందించిన విషయం తెలియజేస్తూ కాల్ వచ్చింది. పోలీసులు సాక్షులను విచారిస్తున్నారు.

English summary
A manhunt was underway after a gunman killed at three people were and injured two during a shooting at a mall in the US state of Washington.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X