మయన్మార్‌లో తీవ్రవాదుల విధ్వంసకాండ, 71 మంది మృతి
నెషీటా: మయన్మార్‌లో మరోసారి తీవ్రవాదులు భీకరదాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో సుమారు 71 మంది మరణించారు.
ఉగ్రవాదుల దాడిలో వందలాది మంది గాయపడ్డారు. రాష్ట్రమంతా ఎమర్జెన్సీని ప్రకటించింది ప్రభుత్వం. క్షతగాత్రులను ఆసుపత్రుల్లో చేర్పించారు.
దాడికి పాల్పడింది రోహింగ్యా తీవ్రవాదులేనని మయన్మార్ ఆర్మీ అధికారులు తెలిపారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత బంగ్లా సరిహద్దులోని ఘంగ్‌టావ్ పోలీస్‌స్టేషన్ తీవ్రవాదులు పేల్చేశారు.

అదే సమయంలో రఖినేలోని కొన్ని పోలీస్‌స్టేషన్లు, ఆర్మీ క్యాంపులపై దాడులు నిర్వహించారు. మొత్తం 200 మంది తీవ్రవాదులు ఈ దాడుల్లో పాల్గొన్నారని సమాచారం.
ఇరువైపులా ప్రాణ నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్ సరిహద్దును ఆనుకొని ఉండే రఖినే రాష్ట్రంలోకి రొహింగ్యా ముస్లింల వలసలు ఎక్కువ. దీంతో స్థానిక ప్రజలకు వలసదారులకు మధ్య ఘర్షణలు జరిగేవి. ఒక దశలో క్రమంలోనే ప్రారంభమైన హింసాయుత పోరాటం దశాబ్దాలుగా కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications