ప్రేమికురాలిగా మారిన భార్య... ! మతిమరుపుకు ముందు ఓసారి, తర్వాత మరోసారి పెళ్లి చేసుకున్న ప్రియుడు...!
ఒక మనిషిని రెండు సార్లు పెళ్లి చేసుకోవడం మనకు తెలిసి సినిమాల్లోనే సాధ్యం అవుతోంది. ఎందుకంటే ఎదో కారణాలతో విడిపోవడం, లేదా మతిమరుపుతో ఇళ్లు విడిచి వెళ్లిపోవడం లాంటీ సంఘటనలు సినిమాల్లో చోటు చేసుకుంటాయి... కథలో భాగంగా విడిపోయిన దంపతులు పిచ్చి ముదిరిన తర్వాత తిరిగి కలిసి ఉండడం జరుగుతోంది. దాంతో కథ సుఖాంతం అవుతోంది.. కాని సినిమాలో కూడ ఊహించని ఓ సంఘటన నిజ జీవీతంలో జరిగింది. ఓ భర్త తన మతి మరుపుతో భార్యను వదిలి తిరిగి అదే భార్యను తిరిగి ప్రియురాలుగా స్వీకరించి మరోసారి పెళ్లి చేసుకున్నాడు.

స్కాట్‌లాండ్‌లో అరుదైన సంఘటన
స్కాట్‌లాండ్‌లో అన్నే డంకెన్ మహిళ వయస్సు ప్రస్తుతం 69 సంవత్సరాలు, కాగా ఆమే భర్త అయిన బిల్ వయస్సు 71 సంవత్సరాలు. కాగా ఇద్దరికి కాస్త లేటు వయస్సులో 12 సంవత్సరాల క్రితం పెళ్లి అయింది. మూడేళ్లు కాపురం బాగానే కొనసాగింది. దీంతో ఇద్దరికి ఓ కూతురు కూడ జన్మించింది.. అయితే కూతురు పుట్టిన తర్వాత అయితే బిల్ మతిమరుపు వ్యాధికి గురయ్యాడు. దీంతో భార్య పిల్లలను సైతం మరిచి పోయాడు. దీంతో చేసేదిమి లేక అన్నే డంకన్ వేరు కాపురం పెట్టింది. తన కూతురుతో జీవితం కొనసాగిస్తోంది...

మతిమరుపుతో భార్యనే తిరిగి లవర్‌గా చేసుకున్న భర్త
ఇక విశేషమిటంటే మరిచిపోయిన బిల్ మరోసారి తన భార్యతో ప్రేమాయాణంలో పడ్డాడు. భార్య అని మరిచి పోయి...గత శుక్రవారం ఆమేవద్దకు వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాంటూ పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. దీంతో అవాక్కయినా భార్య ,తన భర్త మతిమరుపు గురించి తెలిసి దానికి ఓకే చెప్పలేదట. ఇలా మతిమరుపు మనిషిని ఎన్నిసార్లు పెళ్లి చేసుకున్నా ప్రయోజం లేదని నిట్టూర్చింది. అయితే పెళ్లి విషయం మరిచి పోని బిల్ మరో రెండు మూడు రోజుల తర్వాత కూడ వచ్చి అదే విషయాన్ని మళ్లి అడిగాడు. దీంతో ఉబ్బి తబ్బిబ్బయిన భార్య ,భర్తకు మతిమరుపు తగ్గిపోయిందని .. ప్రేమ విషయాన్ని గుర్తు పెట్టుకుని తిరిగి వచ్చి ప్రపోజ్ చేయడంతో రెండోసారి పెళ్లికి అంగీకరించింది.

భార్యను తిరిగి పెళ్లి చేసుకున్న మతిమరుపు వ్యక్తి
దీంతో తనకు దూరంలో ఉన్న కూతురుకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పింది. వెంటనే లేటు వయస్సులో మరోసారి పేళ్లి కూతురు అయింది.పెళ్లి బట్టలకు ఆర్డర్ చేసి గత ఆదివారం పెళ్లి చేసుకుంది. తన ఇంటి ఆవరణలో పెళ్లి సందడి, తిరిగి గ్రీటింగ్స్ లాంటీ అంశాలు అన్నేను సంతోషంలో మునిగిపోయింది. విషయం ఏమిటంటే తన భర్త ఇప్పటికీ తన భర్త కొత్తగా పెళ్లి అయిన భ్రమలోనే ఉన్నారంటూ అన్నే మురిసిపోతోంది. ఇదే అంశాన్ని ఆమే ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో విషయం ప్రపంచానికి తెలిసింది. దీంతో ఆమే ప్రేమాయానికి ముగ్దులైన నెటిజన్లు లక్షలాదిగా కామెంట్స్ పెట్టారు. ఏది ఏమైన మతిమరుపుతో మరిచి పోయిన భర్త తిరిగి తొమ్మిది సంవత్సరాల తర్వాత తననే ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది నిజంగా అదృష్టమనే చెప్పాలి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications