అమెరికాలో పుట్టే వారికి ట్రంప్ అదిరిపోయే గిఫ్ట్.. ఖాతాలో 1000 డాలర్లు!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శుభవార్త చెప్పారు. అమెరికా జాతీయుల పట్ల ఎనలేని ప్రేమను చూపించే ట్రంప్ అక్కడ పుట్టబోయే శిశువులకు బహుమతి ఇస్తున్నారు. అమెరికాలో పుట్టిన అమెరికన్ పిల్లల భవిష్యత్తుకు ఆర్థిక భరోసానిచ్చే ఒక గొప్ప ప్లాన్ ను అందించడానికి రెడీ అయ్యారు. దేశంలోని బడా బిజినెస్ మెన్ లను, పలు దాతృత్వ సంస్థలను దీనికోసం విరాళాలు ఇవ్వవలసింది డోనాల్డ్ ట్రంప్ కోరారు.
ట్రంప్ అకౌంట్స్ తో పిల్లలకు ఆర్ధిక భరోసా
అమెరికా ఫస్ట్ నినాదంతో అమెరికన్ల భద్రతకు, ఆర్థిక ప్రగతికి పెద్దపీట వేస్తున్న డోనాల్డ్ ట్రంప్ అమెరికాలో పుట్టబోయే అమెరికన్ పిల్లలకు ఆర్థికభరోసా కల్పించడం కోసం ట్రంప్ అకౌంట్స్ పేరుతో ఒక ప్రోగ్రాంను మొదలుపెట్టారు. ట్రంప్ అకౌంట్స్ ద్వారా అమెరికాలో పుట్టే పిల్లలకు వారి అకౌంట్లో వెయ్యి డాలర్లను వేస్తారు. ఈ వెయ్యి డాలర్లను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి, తిరిగి వారి పెద్దయ్యేవరకు వారికి కావలసిన ఆర్థిక భరోసాను కల్పిస్తారు.

ప్రతి అమెరికన్ నవజాత శిశువుకు వెయ్యి డాలర్ల డబ్బులు
అమెరికాలో పుట్టే పిల్లలకు వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా 18 ఏళ్ల వయసు నుండే ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించడం ఈ ట్రంప్ అకౌంట్స్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఈ సంవత్సరం ప్రారంభంలో చట్టంగా సంతకం చేయబడిన ఈ బిల్లు ప్రతి అమెరికన్ నవజాత శిశువుకు వెయ్యి డాలర్లను ఇస్తుంది. ఆ వెయ్యి డాలర్ల డబ్బు వచ్చేసరికి ఆ డబ్బు మొత్తాన్ని పిల్లలకు జమ చేస్తారు.
ప్రముఖ బిలియనీర్లను విరాళం ఇవ్వాలని కోరిన ట్రెజరీ
తక్కువ ఆదాయ కుటుంబాల పిల్లల సంపదను పెంచడానికి సహాయపడే ఈ ప్రోగ్రాం కు అమెరికాలోని సంపన్న వర్గాలను సహాయం చేయవలసిందిగా ట్రంప్ విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రముఖ బిలియనీర్లు ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి తమ విరాళాన్ని ప్రకటిస్తున్నారు. ఇలా ట్రంప్ అకౌంట్స్ ట్రెజరీకి విరాళం ఇచ్చినట్లయితే వారి పన్ను రాయితీలు కూడా పొందవచ్చు. ఇక ఈ పద్ధతిలో అమెరికాలో పుట్టే శిశువు, శిశువు దశ నుండే ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ తో మంచి భవిష్యత్తును పొందబోతున్నారు.












Click it and Unblock the Notifications