• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా విరాళాల కోసం సెక్స్ వీడియో.. లాక్‌డౌన్‌లో అదొక్కటే పని.. లేడీ జర్నోకు బీబీసీ వార్నింగ్

|

మహమ్మారి చుట్టుముట్టినవేళ.. లాక్ డౌన్ తో ఇబ్బంది పడుతున్న పేదల కోసం ఎంతో మంది ఎన్నో రకాలుగా సహాయ కార్యక్రమాలు చేస్తుండటం చూస్తున్నాం. కాస్త కలిగినవాళ్లైతే ముఖ్యమంత్రి సహాయ నిధికో, పీఎం కేర్స్ ఫండ్‌కో విరాళాలు ఇస్తున్నారు. ఫండ్ రైజింగ్స్ లో ముందుండే విదేశాల్లోనూ ఈ పని జోరుగా సాగుతోంది. అయితే కొందరు మాత్రం క్రేజీ ఐడియాలతో కరోనా విరాళాలు సేకరిస్తున్నారు. అలాంటివాళ్లలో ఓ మహిళా జర్నలిస్టు కూడా ఉండటం, ఆమె పనిచేస్తోన్న సంస్థకు ఆ ప్రయత్నం నచ్చకపోవడం, దాంతో టార్గెట్ పూర్తికాకముందే వీడియోను తొలగించాల్సిరావడం టకటకా జరిగిపోయాయి..

 ఆమె చాలా పాపులర్..

ఆమె చాలా పాపులర్..

39ఏళ్ల ఎమ్మా వర్డీ ప్రస్తుతం ప్రఖ్యాత బీబీసీ తరఫున ఐర్లాండ్ లో కరస్పాండెంట్ గా పని చేస్తున్నారు. అద్భుతమైన పొలికల్ కథనాలు రూపొందించిన ఆమె చాలా సార్లు ఉత్తమ జర్నలిస్టు అవార్డులు కూడా పొందారు. డబ్లిన్ సిటీలోని పాపులర్ వ్యక్తుల్లో ఆమె కూడా ఒకరు. కొన్నాళ్లుగా ఆరోన్ ఆడమ్స్ అనే ఫుట్ బాలర్‌తో సహజీవనం చేస్తున్నారు. కొవిడ్-19పై యుద్ధం చేస్తోన్న నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్‌హెచ్ఎస్)కు విరాళాలు సేకరించే క్రమంలో క్రేజీగా వ్యవహరించి ఆమెనే వార్త అయ్యారిప్పుడు..

 బ్రేక్ లేకుండా అదే పని..

బ్రేక్ లేకుండా అదే పని..

బాయ్ ఫ్రెండ్ ఆడమ్స్ తో కలిసి ఎమ్మా వర్డీ ఓ స్ఫూఫ్ సెక్స్ వీడియోలో కనిపించారు. ‘‘నాలుగు వారాలుగా లాక్ డౌన్.. నో ఫుట్‌బాల్.. నో వర్క్.. ఇంట్లో ఇది మాత్రమే జరుగుతోంది.. ''అనే క్యాప్షన్ తో ఆడమ్స్ ఆ క్లిప్ ను పోస్ట్ చేశాడు. వీడియోలో ఎమ్మా.. క్వీన్ బ్యాండ్ రూపొందించిన ‘ఐ వాంట్ వాంట్ టు బ్రేక్ ఫ్రీ' పాట పాడుతూ కనిపిస్తారు. సదరు వీడియోను ఆడమ్స్ టీమ్ మేట్స్ షూట్ చేసినట్లుగా తెలిసింది. వీడియో చూసినవాళ్లంతా కరోనా విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరారు. గంటల వ్యవధిలోనే మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ..

తప్పు ఒప్పుకుని..

తప్పు ఒప్పుకుని..

బాధ్యతగల జర్నలిస్టుగా ఎమ్మా చేసిన పని బాగోలేదని బీబీసీ బాసులు హెచ్చరించడంతో ఆమె వీడియోను తొలగించక తప్పలేదు. ఈ వ్యవహారంపై బీబీసీ అధికారిక ప్రతినిధి మాట్లాడుతూ, తాను చేసిన పని కరెక్ట్ కాదని ఎమ్మానే అంగీకరించారని చెప్పారు. ఉద్యోగులకు ఎడిటోరియల్ గైడ్ లైన్స్ ఉంటాయన్న సంగతిని గుర్తుచేశారు. ఆ తర్వాత ఆడమ్స్ పోస్టుచేసిన వీడియోలో ఎమ్మా ఎక్కడా కనిపించలేదు.

ఐర్లాండ్ లో ఇదీ సీన్..

ఐర్లాండ్ లో ఇదీ సీన్..

పొరుగుదేశం బ్రిటన్ లో కొవిడ్-19 కేసులు 1.57లక్షలు, మరణాలు 21వేలుగా నమోదుకాగా, ఐర్లాండ్ లో కేసుల సంఖ్య 20వేలకు, మరణాల సంఖ్య 1100కు పెరిగాయి. అయితే వైరస్ బారినపడ్డవాళ్లలో సగం మంది ఇప్పటికే కోలుకున్నారక్కడ. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 30లక్షలకు, మరణాలు 2.13లక్షలకు పెరిగాయి.

English summary
The BBC's Ireland correspondent Emma Vardy appeared in a spoof sex scene to raise money for the NHS amid the coronavirus. but bosses order to take down video.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X