sadist lady: రైల్వే స్టేషన్ లో 3 ఏళ్ల అమ్మాయిని రైల్వే ట్రాక్ మీద విసిరేసింది, శాడిస్టు మేడమ్ ఎవరు ?

న్యూయార్క్/అమెరికా: కొంత మంది ఎప్పుడు ఏం చేస్తారో ఎవ్వరికీ తెలీదు. తల్లితో కలిసి ఓ చిన్నారి ఇంటి నుంచి బయలుదేరి రైల్వేస్టేషన్ కు వెళ్లింది. రైలు వస్తే కూతురితో కలిసి రైలు ఎక్కడానికి ఆ తల్లి సిద్దంగా ఉంది. రైల్వేస్టేషన్ లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగానే ఉంది. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో కాని ఓ శాడిస్టు మహిళ తల్లి పక్కన నిలబడివున్న అమ్మాయిని ఒక్కసారిగా రైల్వే ట్రాక్ మీదకు విసిరేసి చల్లగా వెళ్లి రైల్వేస్టేషన్ లోని ఫ్లాట్ ఫామ్ లోని ఓ కుర్చీలో కుర్చుంది. తరువాత ఏం జరుగుతుందో చూద్దామని ఆలేడీ ఆసక్తిగా గమనించడంతో అందరూ షాక్ అయ్యారు.

రైల్వే స్టేషన్ లో

రైల్వే స్టేషన్ లో

అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలోని మల్టీనోమా అనే నగరంలోని రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కేందుకు ప్రయాణికులు కొంతసేపు నుంచి వేచి చూస్తున్నారు. ఓ మహిళ ఆమె 3 కుమార్తెతో కలిసి రైలు ఎక్కేందుకు అదే రైల్వే స్టేష్ లో నిలబడి ఉంది. అక్కడికి వచ్చిన 32 ఏళ్ల మహిళ ఒక్కసారిగా చిన్నారిని రైలు పట్టాలపైకి తోసింది. రైలు పట్టాలపై పడి బాలిక తలకు, నుదుట తీవ్రగాయాలైనాయి.

రైల్వే ట్రాక్ మీద తోసేసి సైలెంట్ గా కుర్చుంది

రైల్వే ట్రాక్ మీద తోసేసి సైలెంట్ గా కుర్చుంది

ఈ సంఘటనతో సాటి ప్రయాణికులు షాక్‌కు గురైనారు. వెంటనే ఓ వ్యక్తి రైలు పట్టాలపైకి దూకి చిన్నారిని రక్షించి రైల్వే ట్రాక్ మీద నుంచి బయటకు తీసుకు వచ్చాడు. చిన్నారిని తోసేసిన మహిళ ఏమీ పట్టనట్టు వెళ్లి అదే రైల్వేస్టేషన్ లోని సీటులో కూర్చుంది. శాడిస్టు మహిళచ చిన్నారిని రైల్వే ట్రాక్ మీదకు తోసేసిన దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డె అయ్యింది.

శాడిస్టు మహిళ ఎవరు ?

శాడిస్టు మహిళ ఎవరు ?

వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు బాలికను రైల్వే ట్రాక్ మీద తోసేసిన మహిళను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో శాడిస్టు మహిళ పేరు బ్రియానా లేస్ అని తేలింది. చిన్నారిని తోసేసిన బ్రియానా లేస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే రైలు ప్లాట్‌ఫారమ్‌పై రికార్డయిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బెయిల్ రాకుండా చెయ్యాలి

బెయిల్ రాకుండా చెయ్యాలి

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా పోలీసులు ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశారు. మహిళ మూడేళ్ల బాలికను రైలు పట్టాలపై ఎందుకు విసిరింది ? అని పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కిరాతక చర్యకు పాల్పడిన బ్రియానా లేస్ అనే మహిళ బెయిల్‌పై విడుదల చేయకుండా కఠినంగా శిక్షించాలని పోలీసులు కోర్టుకు మనవి చేస్తున్నారు. ఎక్కడి నుంచో సైలెంట్ గా వచ్చిన బ్రియానా లేస్ ఓ అమ్మాయిని రైల్వే ట్రాక్ మీదకు తోసేసి హత్య చెయ్యడానికి ప్రయత్నించడం కలకలం రేపింది. తలకు తీవ్రగాయాలైన అమ్మాయి ఐసీయూలో చికిత్స పొందుతున్నదని స్థానిక పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+