Trump and Elon Musk: ట్రంప్ గెలుపులో ట్రంప్ కార్డు ఎలాన్ మస్క్... ప్రభుత్వంలో కీలక పోస్టు..!!

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు కూడా వెలువడ్డాయి.నాలుగేళ్ల గ్యాప్ తర్వాత మరోసారి అధ్యక్ష పీఠాన్ని రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అధిష్టించనున్నారు. అయితే అధికారికంగా వైట్ హౌజ్‌లోకి ప్రవేశించేది మాత్రం జనవరి 20వ తేదీనే. ఎందుకంటే వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.ఇక ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు టెక్ దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్. తాజాగా ఏర్పడబోయే ట్రంప్ ప్రభుత్వంలో ఎలాన్ మస్క్ పాత్ర ఎలా ఉండనుంది..?

ఎలాన్ మస్క్..ప్రపంచ కుబేరుల్లో ఒకరు. వివాదాలకు కేరాఫ్‌గా నిలిచే వ్యక్తి ఎలాన్ మస్క్. ఇక అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్,కమలా హారిస్‌తో పాటు ఎక్కువగా వినిపించిన పేరు ఎలాన్ మస్క్. ఈ అపరకుబేరుడు ఒకప్పుడు డొనాల్డ్ ట్రంప్‌ను విబేధించినప్పటికీ ఆ తర్వాత ఇద్దరికీ స్నేహం బాగా కుదిరింది. ఇంకా చెప్పాలంటే ట్రంప్ విజయంలో ఎలాన్ మస్క్ కీలకంగా వ్యవహరించారనేది నగ్న సత్యం.అయితే ఎలాన్ మస్క్ ట్రంప్ గెలుపు కోసం ఎందుకు తపించారు.. అధికారంలోకి వస్తే ఏమైనా ఆశించారా అనేది ఇప్పుడు సర్వత్రా జరుగుతున్న చర్చ.

A Second Trump Term Why Elon Musk Could Be the Biggest Beneficiary

ట్రంప్‌ విజయంలో ట్రంప్ కార్డు మస్క్

ఎలాన్ మస్క్ ట్రంప్ విజయంలో ట్రంప్‌కార్డులా వ్యవహరించారు. ఎక్స్ వేదికగా ట్రంప్‌కు పూర్తి సహాయసహకారాలు అందించారు. ఇక ట్రంప్ గెలుపు కోసం మస్క్ దాదాపుగా 119 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టారంటే వీరిద్దరి మధ్య స్నేహం ఎంత దృఢమైనదో అర్థం చేసుకోవచ్చు.అంతేకాదు స్వింగ్ స్టేట్స్‌లో ఒకటిగా ఉన్న పెన్సిల్వేనియా రాష్ట్రంలో మస్క్ ట్రంప్‌కు మద్దతుగా పలు ఈవెంట్లను సైతం నిర్వహించారు.ఇక ఎక్స్ వేదికగా ట్రంప్‌ను కూడా ఇంటర్వ్యూ చేశారు మస్క్.పచ్చిగా చెప్పాలంటే ఎక్స్ వేదికను ట్రంప్ అనుకూల మీడియాగా మార్చారు మస్క్. ఇక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో ట్రంప్‌ మస్క్ ఇద్దరూ ఒకేచోట ఉంటూ ఫలితాలపై చర్చిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇదంతా బాగానే ఉన్నా ఇప్పుడు అధికారం చేపట్టనున్న ట్రంప్ మస్క్‌కు ఎలాంటి స్థానం ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ట్రంప్‌కు సలహాదారుడి హోదాలో మస్క్..?

ట్రంప్ ప్రభుత్వంలో ఎలాన్ మస్క్ కీలకంగా వ్యవహరించే అవకాశాలున్నాయనే వార్త ప్రచారంలో ఉంది. ట్రంప్‌కు సలహాదారుడిగా వ్యవహరిస్తూ ఎక్కడికక్కడ అనవసరపు ఖర్చులను తగ్గిస్తూ ఎక్కడ వాటిని వినియోగించాలో చెప్పే ప్రయత్నం చేసే అవకాశం ఉంది.అంతేకాదు తన వ్యాపారాలపై నియంత్రణ కలిగి ఉండే ప్రభుత్వ సంస్థలను సైతం తాను హ్యాండిల్ చేసే అవకాశం లేకపోలేదు. వాణిజ్య రంగంలో ఎలాన్ మస్క్ పెట్టుబడులు ఇతర దేశాల్లో కూడా ఉన్నాయి.ముఖ్యంగా అమెరికాకు బద్ద శతృవైన చైనాలో మస్క్ పెట్టుబడులు పెట్టారు.ఇప్పుడు ట్రంప్ రాకతో చైనాలోని తన ఇన్వెస్ట్‌మెంట్స్ సురక్షితమే అనే సంకేతాలు వెళుతున్నాయి. ఇక అమెరికా రక్షణ వ్యవస్థలో మస్క్ జోక్యం చేసుకుంటే ఆ దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

A Second Trump Term Why Elon Musk Could Be the Biggest Beneficiary

ఎలాన్ మస్క్‌కు చెందిన విద్యుత్ వాహనాల సంస్థ టెస్లా ప్లాంట్ చైనాలో ఉంది. అయితే చైనా అమెరికాల మధ్య వాణిజ్య పోరు ఎప్పటి నుంచో ఉంది. ఇక ట్రంప్ రాకతో ఇక్కడ రాజీ కుదిరే అవకాశం ఉంది. ఎందుకంటే టెస్లా సంస్థ చైనాపై ఎక్కువగా ఆధారపడి ఉంది. తన వాహనాలకు సరైన మార్కెట్ చైనా. ఈ మధ్యనే చైనాకు వెళ్లిన సందర్భంలో తైవాన్ చైనా అంతర్భాగమనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి డ్రాగన్ కంట్రీకి మద్దతు తెలిపారు మస్క్.

ట్రంప్ అండతో అంతరిక్ష రంగంలో మస్క్ మార్క్

ఇక ట్రంప్ ప్రభుత్వంలో మస్క్ తన వాణిజ్య వ్యాపార కార్యకలాపాలను చక్కబెట్టుకునే అవకాశం ఉందని కొందరు అమెరికా ఉన్నతాధికారులు చెబుతున్నారు.విధానపరమైన నిర్ణయాల్లో మస్క్ జోక్యం ఉంటుందని పేర్కొన్నారు. అమెరికాను కాదని చైనా తన మిలటరీ ఇంటెలిజెన్స్‌ను మరింత బలోపేతం చేసుకునే క్రమంలో వాడే టెక్నాలజీకి మస్క్ మద్దతు ఉంటుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక అంతరిక్ష రంగాన్ని కూడా మస్క్ శాసించే అవకాశాలున్నాయి. తన సొంత అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్‌ను కూడా విస్తరించే అవకాశాలున్నాయి.అమెరికా ప్రభుత్వంతో బోయింగ్ సంస్థకు చాలా ఒప్పందాలు జరిగాయి. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వంలోకి రానుండటంతో ఆ ఒప్పందాలకు స్వస్తి పలికి ఏరోస్పేస్ రంగంలో మస్క్ కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టే ఛాన్సులున్నాయి. ట్రంప్‌తో ఉన్న మంచి స్నేహం తన వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు ఉపయోగపడుతుందనే వాదన ఉంది.

ట్రంప్ కూడా మస్క్‌కు ఒక కీలక పోస్టు ఇస్తారనే ప్రచారం ఉంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ప్రభుత్వం వస్తే కాస్ట్ కట్టింగ్‌ శాఖ సృష్టించి మస్క్‌ను సెక్రటరీగా నియమిస్తానని ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే తన కేబినెట్‌లోకి తీసుకుంటానని మాత్రం స్పష్టం చేయలేదు. ఇక అంగారక గ్రహానికి తన రాకెట్ పంపేందుకు మస్క్‌కు తాను సహాయసహకారాలు అందిస్తానని ట్రంప్ మాటిచ్చారు కూడా.

మొత్తానికి ట్రంప్ నూతన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధ్యక్ష కార్యాలయంలో మస్క్ అడుగు పెడతారనే ప్రచారం జరుగుతోంది. ఇక బిజినెస్ కమ్యూనిటీకి చెందిన ఇద్దరు కలిస్తే అటు అమెరికా అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికీ మరో మస్క్ ఎంట్రీతో ముప్పు కూడా పొంచి ఉందనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+