ఇస్లామిక్ స్టేట్ వీడియోతో స్ఫూర్తి: ఆరుగురి తలలు నరికిన హంతకుడి అరెస్ట్

‘ఇప్పటి వరకు నిందితుడు ఏడుగురిపై దాడి చేశాడు. ఇందులో ఆరుగురు మృతి చెందారు. శనివారం నాడు తొలి హత్యకు పాల్పడ్డాడు. మా విచారణలో మరిన్ని హత్యలు బయటపడే అవకాశం ఉంది' అని మోగిదాస్ క్రూజెస్‌కు చెందిన పోలీస్ కమిషనర్ మార్కోస్ బటల్హా వెల్లడించారు. నిందితుడు అతని ఎడమ భుజంపై గొడ్డలి టాట్టూను వేసుకున్నాడని తెలిపారు.
బుధవారం అతని నివాసంలో తలలేని మూడు మృతదేహాలను గుర్తించినట్లు ఆయన చెప్పారు. న్యూస్ పోర్టల్ జి1 కథనం ప్రకారం.. 36మందిని హత్య చేయాలని నిందితుడు నిర్ణయించుకున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కొందరు జర్నలిస్టుల తలనరికిన వీడియోలను చూసి నిందితుడికి ఈ ఆలోచన వచ్చినట్లు చెప్పారు.
వరుస హత్యలకు పాల్పడుతూ ఆనందాన్ని పొందుతున్నట్లు నిందితుడు వెల్లడించాడని ఆయన తెలిపారు. తనను ఎవ్వరూ అరెస్ట్ చేయలేరని నిందితుడు భావించినట్లు చెప్పారు. వీధుల్లో పన్నుల చెల్లించకుండా ఉండే ప్రజలను తాను హత్య చేసినట్లు నిందితుడు తెలిపాడని పోలీసులు వెల్లడించారు.
ఓ వ్యక్తి తలను నరుకుతుండగా చూసిన ఓ ప్రత్యక్షసాక్షి అందించిన సమాచారం మేరకు నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications