Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ట్రాన్స్‌జెండర్ కిడ్నాప్...! అత్యాచారం...!

కామంధులు ఓ ట్రాన్స్‌జెండర్‌ను కూడ వదిలి పెట్టలేదు. ఆర్ధరాత్రి ఓ ఈవెంట్‌లో పాల్గోని వస్తున్న ట్రాన్స్‌జెండర్‌‌ను అడ్డగించిన దుండగులు కిడ్నాప్ చేశారు. అనంతరం మూడు గంటల పాటు చుక్కలు చూపించారు. అయిదుగురు వ్యక్తులు ఆమేపై అత్యాచారం చేసిన సంచలన సంఘటన పాకిస్తాన్‌లో వెలుగు చూసింది.

పాకిస్తాన్‌లోని కామలి నగరంలోని దూప్‌సారి అనే గ్రామంలో ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఈవెంట్ కోసం దూప్‌సారి గ్రామానికి నలుగురు ట్రాన్స్‌జెండర్‌లు వెళ్లారు. వారు ఈవెంట్‌ను పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా మార్గమధ్యలోనే ఆర్థరాత్రి రెండుగంటల ప్రాంతంలో వారిని కొంతమంది దుండగులు అడ్డగించారు. ట్రాన్స్ జెండర్లతో అయిదుగురు దుండగులు అసభ్యకరంగా ప్రవర్తించారు. అనంతరం నలుగురి ట్రాన్స్‌జెండర్లలో ఒకరిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. స్థానికంగా ఉన్న ఫామ్‌హౌజ్ తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటనపై హరప్పా ప్రాంతంలో దుమారం రేగుతోంది.

A transgender was allegedly tortured and raped by five persons

దీంతో ఆదే రాత్రి అయిదుగురు దుండగులు ట్రాన్స్‌జెండర్‌పై అత్యాచారానికి పాల్పడ్డారు. అర్థరాత్రి కావడంతో ఎలాంటీ సహయం అందక నరకం చూసింది. అయితే వారి కొరిక తీరిన అనంతరం తాను నివాసం ఉంటున్న సహివాల్ నగరంలో విడిచిపెట్టి వెళ్లిపోయారు. తెల్లవారిన తర్వాత ట్రాన్స్ జెండర్ ఓ స్నేహితురాలి సహాయంతో ఇంటికి చేరుకుంది. అనంతరం స్థానిక హరప్పా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సంఘటన జరిగిన సంఘటనపై పోలీసులు కూడ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అయితే ఉన్నతాధికారులకు విషయం చేరడంతో ఎట్టకేలకు అత్యాచారనికి పాల్పడిన అయిదుగురిని అరెస్ట్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+