Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Putin body double: రష్యా అధ్యక్షుడి డూప్లికేట్

మాస్కో: రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్.. రోజూ వార్తల్లో నిలుస్తోన్నారీ మధ్యకాలంలో. ఒకవంక పార్కిన్సన్ తో బాధపడుతున్నట్లు చెబుతోన్నారు. ఆయన కాళ్లు పని చేయట్లేదని, చేతులు సహకరించట్లేదనే వార్తలు చాలాకాలం నుంచీ వినిపిస్తూ వస్తోన్నాయి. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని, అధికారిక కార్యక్రమాలు, సమీక్ష సమావేశాల సమయంలో ఆయన శరీరం వణుకుతోందంటూ కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

ఉక్రెయిన్ లో..

ఉక్రెయిన్ లో..

ఈ పరిస్థితుల్లో ఆయన వ్లాదిమిర్ పుతిన్ ఎవ్వరూ ఊహించని విధంగా- ఉక్రెయిన్ లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. మారియుపోల్ నగరాన్ని సందర్శించారు. రష్యా రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖ అత్యున్నత స్థాయి అధికారులు, సైన్యాధికారులు ఆయన వెంట ఉన్నారు. యుద్ధం ఆరంభానికి ముందు ఉక్రెయిన్ లో భాగమైన నగరం..మారియుపోల్. రష్యా సరిహద్దులకు ఆనుకునే ఉంటుంది. డొనెట్స్క్ రీజియన్ లో అతిపెద్ద నగరం ఇదే.

సొంతంగా కారు డ్రైవ్ చేసుకోవడం..

సొంతంగా కారు డ్రైవ్ చేసుకోవడం..

యుద్ధం ఆరంభమైన తరువాత ఉక్రెయిన్ గడ్డపై పుతిన్ అడుగు పెట్టడం ప్రపంచ దేశాల్లో చర్చనీయాంశమైంది. ఆయనే స్వయంగా కారును డ్రైవ్ చేసుకుంటూ నగరం మొత్తం తిరుగాడారు. దీనికి సంబంధించిన వీడియోలను రష్యా అధికారులు సోషల్ మీడియాలో విడుదల చేశారు. యుద్ధ సమయంలో ధ్వంసానికి గురైన భవనాలు, ఇతర కట్టడాలను రష్యా పునర్నిర్మిస్తోంది రష్యా. ఆ పనులను పుతిన్ స్వయంగా పర్యవేక్షించారు.

పుతిన్ కాదా?

ఈ పనులన్నీ చేసింది పుతిన్ కాదనే వాదనలు ఉన్నాయి. పార్కిన్సన్ తో బాధపడుతోన్న వ్లాదిమిర్ పుతిన్- మారియుపోల్ నగరాన్ని సందర్శించడాన్ని చాలామంది నమ్మలేకపోతున్నారు. తానే స్వయంగా కారును డ్రైవ్ చేసుకోవడం పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తోన్నారు. మారియుపోల్ సిటీలో పర్యటించింది పుతిన్ కాదని, ఆయన బాడీ డబుల్ అయ్యుండొచ్చనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి. బాడీ డబుల్ తో ఆయన రష్యా ప్రజలను మోసం చేస్తోన్నారనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

అనేక తేడాలు..

అనేక తేడాలు..

దీనిపై తాజాగా డెయిలీ మెయిల్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. మారియుపోల్ నగరంలో పర్యటించిన పుతిన్ వీడియోలు, ఫొటోలు- అసలు పుతిన్ వీడియోలు, ఫొటోలను విశ్లేషించింది. గడ్డం, చెవిలో తేడాలు కొట్టొచ్చినట్టు కనిపించాయని పేర్కొంది. పుతిన్ ముఖంపై ఓ చిన్నమచ్చతో పాటు ముడుతలు ఉన్నాయని, మారియుపోల్ లో పర్యటించిన పుతిన్ ముఖం మీద అవేవీ కనిపించలేదని తెలిపింది. ఇంజెక్షన్లు తీసుకున్నప్పటికీ- అవి పోయే ముడుతలు కావని స్పష్టం చేసింది.

2014 తరహాలో..

2014 తరహాలో..

దీన్ని బట్టి చూస్తే- పుతిన్.. బాడీ డబుల్ ను వినియోగిస్తోన్నాడనే అనుమానాలు మరింత బలపడుతున్నాయని వివరించిందా డెయిలీ మెయిల్ కథనం. 2014లో సొవెస్టోపోల్ లో పుతిన్ పర్యటించినప్పుడు ఆయన ఎలా కనిపించారో.. ఇప్పుడు మారియుపోల్ లోనూ అదే తరహాలో ఉన్నారని తెలిపింది. దీనిపై అటు రష్యాకు చెందిన పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పైన కూడా బాడీ డబుల్ కు చెందిన పలు వీడియోలు, ఫొటోలు భారీగా సర్కులేట్ అవుతున్నాయి

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+