Viral Video: అమెరికాలో నల్ల జాతి మహిళపై పోలీస్ దాష్టీకం.. వైరల్ అయిన వీడియో..
అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఘోరం జరిగింది. ఓ నల్ల జాతి మహిళ పట్ల పోలీస్ ప్రవర్తించిన తీరు దిగ్బ్రాంతికరంగా ఉంది. తన భర్త అరెస్ట్ సదరు మహిళ వీడియో తీసింది. దీంతో ఓ పోలీస్ ఎందుకు వీడియో తీస్తున్నావంటూ మహిళపైకి దూసుకొచ్చి.. ఆమెను కింద పడేశాడు. ఆమె కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టాడు. ఈ ఘటన లాస్ ఏంజెల్స్ లోని విన్‌కో గ్రాసరీ దుకాణం బయట జరిగింది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూన్ 24 ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిసింది.
లాస్ ఏంజెల్స్ విన్‌కో గ్రాసరీ స్టోర్ లో ఇద్దరు దంపతులు చోరీ చేశారని ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు భర్తను అరెస్ట్ చేశారు. భర్తను అరెస్ట్ చేస్తున్నప్పుడు భార్య వీడియో తీసింది. ఇది గమనించిన లాస్ ఏంజెల్స్ కౌంటీ డిప్యూటీ ఆ మహిళపైకి దూసుకెళ్లాడు. ఆమెను కిందికి దోబ్బాడు. మెకాలితో ఆమెను అదిమి పట్టాడు. కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టాడు. దీంతో మహిళ కళ్ల మంటతో అర్థనాదాలు చేసింది. ఇది చూస్తున్న భర్త తన భార్య ఏం చేయకండి అంటూ అరిచాడు. తన భార్య క్యాన్సర్ బాధపడుతుంది వదలిపెట్టండి అంటూ ప్రాధేయపడ్డాడు.

తాము దొంగతనం చేయలేదని చెప్పాడు. అయితే ఆ పోలీస్ అధికారి మహిళ పట్ల ప్రవర్తించిన తీరును అక్కడే ఉన్న కొంత మంది వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రజల నుంచి భారీగా వ్యతిరేకత రావడంతో ఆ అధికారిని విధుల నుంచి తప్పించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఫాక్స్ న్యూస్ ప్రకారం, వీడియోను రికార్డ్ చేసిన వ్యక్తి లిసా మిచెల్ గారెట్ గతంలో సెక్యూరిటీలో పని చేసినట్లు పేర్కొన్నారు. చాలా మంది నష్ట-నివారణ అధికారులను సూపర్ మార్కెట్ నుంచి బయటకు తీసుకువెళుతున్న వ్యక్తిని, స్త్రీని ఆమె గమనించిన వెంటనే, ఆమె మొత్తం సంఘటనను రికార్డ్ చేయడం ప్రారంభించింది. వీడియోలోని మహిళ "నేను ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను" అని చెబుతున్నట్లు Ms గారెట్ అవుట్‌లెట్‌తో చెప్పారు.
This is Lancaster, California.
— Bishop Talbert Swan (@TalbertSwan) July 4, 2023
A Los Angeles county sheriffs deputy throws a Black woman to the ground and brutalized her for filming them arresting her husband.
Filming the police is not illegal.
This is brutality.
Arrest this pig. pic.twitter.com/BKg9dnZX7M
"లాస్ ఏంజిల్స్ కౌంటీ షెరీఫ్ డిపార్ట్‌మెంట్ ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. కొనసాగుతున్న పరిశోధనలకు సంబంధించిన ప్రకటనలను డిపార్ట్‌మెంట్ చేయనప్పటికీ, డిపార్ట్‌మెంట్ సిబ్బంది ప్రజలందరినీ గౌరవంగా చూడాలని తాను ఆశిస్తున్నాం. మా శిక్షణా ప్రమాణాలను పాటించని సిబ్బంది బాధ్యత వహిస్తారు" అని చెప్పారు.
-
వీళ్లా ఆలయ అధికారులు.. శ్రీరామనవమి నాడే "అశ్లీల నృత్యాల" బాగోతం !! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
సాక్షాత్ FBI చీఫ్ కే దిక్కులేదు- ఇరాన్ హ్యాకర్ల పంజా -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు












Click it and Unblock the Notifications