Viral Video: రెడ్ వైన్ వరద.. తాగొచ్చు.. స్నానం చెయ్యొచ్చు.. వైరల్ అయిన వీడియో..!

చాలా మంది పురుషుకు మద్యం అంటే ఇష్టం ఉంటుంది. కొందరికైతే మంది కనిపించగానే ఎప్పుడు తాగుదామా అని అనిపిస్తుంటుంది. ఇక కస్ట్లీ మందు అంటే చాలా అపురూపంగా తాగుతారు. సీసాలో చివరి చుక్కను కూడా వదలి పెట్టారు. మందుకు అంత గౌరవం ఇస్తారు. అయితే ఓ చోట కళ్ల ముందే లక్షల లీటర్ల మద్యం ఏరులై పారుతుంటే.. మద్యమే వరదలాగే వస్తే ఎలా ఉంటుంది.. ఊహకు అందడం లేదు కదూ.. కానీ ఇది నిజంగా జరిగింది.

ఓ చోట వైన్ వరదల కాలనీల్లలోకి ప్రవేశించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోర్చుగల్‌లోని ఒక చిన్న పట్టణం సమీపంలోని డిస్టిలరీలో జరిగిన ప్రమాదం కారణంగా రెడ్ వైన్ రోడ్లపై భారీ వరదగా మారింది. పోర్చుగల్‌లోని లెవిరాలోని డిస్టిలరీకి చెందిన రెండు రెడ్ వైన్ ట్యాంకులు పేలి వాటిలో ఉన్న వైన్ వీధుల్లోకి వెళ్లింది. 2.2 మిలియన్ లీటర్ల రెడ్ వైన్‌ వరదలా పారింది. రెడ్ వైన్ వరద పట్టణాన్ని ముంచెత్తింది.

A video of Portugal red wine flowing through the colonies has gone viral on social media

లెవిరా డిస్టిలరీ దాని డిస్టిలరీకి సమీపంలో ఉన్న ఒక ఇంటిలోని నేలమాళిగలో వైన్ వరదలు వచ్చాయి. దీనికి వైన్ కంపెనీ బాధ్యత వహిస్తూ క్షమాపన చెప్పింది. స్వచ్ఛంద సేవకులు వైన్ నదికి చేరుకోకుండా నిరోధించారని స్థానిక అధికారులు తెలిపారు. 2.2 మిలియన్ లీటర్ల రెడ్ వైన్‌ను కోల్పోయిన తర్వాత తాము ఆర్థిక నష్టపోయినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. పోర్చుగీస్ పట్టణంలోని సావో లోరెంకో డి బైరోలో ఆదివారం (సెప్టెంబర్ 10న) ఈ ఘటన జరిగింది.

అగ్నిమాపక సిబ్బంది వైన్‌నదిలా ఉగ్రరూపం దాల్చిన ఈ స్టెరిమా నది ప్రవాహాన్ని దారిమళ్లించి సమీపంలోని పోలాల్లోకి వెళ్లేలా చేశారు. అధికారులు ఈ అనుహ్య ఘటనకు ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. వీధుల గుండా రెడ్ వైన్ ప్రవహిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. కొండపై నుంచి రెడ్ వైన్ వేగంగా ప్రవహిస్తూ కనిపించింది. ఈ పట్టణంలో దాదాపు 2 వేల మంది జనాభా నివాసిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+