రోడ్డు ప్రమాదంలో స్టార్ హీరో దుర్మరణం

వాషింగ్టన్: హాలీవుడ్ స్టార్ హీరో ట్రీట్ విలియమ్స్ కన్నుమూశారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు. రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించినట్లు ది హాలీవుడ్ రిపోర్టర్ తెలిపింది. కొలరాడోలో బైక్‌వై వెళ్తోండగా అదుపు తప్పిన ఓ కారు ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించినట్లు పేర్కొంది.

120కి పైగా సినిమాల్లో నటించారాయన. 1975లో డెడ్లీ హీరోతో సినిమాల్లో అరంగేట్రం చేశారు. 1979లో విడుదలైన 1941 మూవీ మంచి పేరు తీసుకొచ్చింది. ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. 120 సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోల్లో నటించాడు. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోన్నారు.

Actor Treat Williams died in a motorcycle accident at the age of 71

ప్రిన్స్ ఆఫ్ ది సిటీ, హెయిర్, వన్స్ అపాన్‌ ఎ టైమ్ ఇన్ అమెరికా, డెడ్ హీట్, థింగ్స్ టు డు ఇన్ డెన్వర్ వెన్ యుఆర్ డెడ్, డీప్ రైజింగ్, ది ఫాంటామ్, ఎవర్‌వుడ్, ది డెవిల్స్ ఓన్, ది సబ్‌స్టిట్యూట్ సిరీస్, హాలీవుడ్ ఎండింగ్, మిస్ కాంజినియాలిటీ 2: ఆర్మ్డ్ అండ్ ఫాబ్యులస్ వంటి సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. హెయిర్ సినిమాతో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్‌ను సైతం అందుకున్నారు.

ట్రీట్ విలియమ్స్ నటించిన చివరి సినిమా 12 మైటీ ఆర్ఫన్స్. 2021లో ఇది విడుదలైంది. వెబ్ సిరీస్, టీవీ షోలతో బిజీగా ఉంటోన్నారు. అనూహ్యంగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బైక్‌పై వెళ్తోన్న ఆయనను కారు ఢీ కొన్న ఘటనలో కన్నుమూశారు. విలియమ్స్ మరణవార్తను ఆయన వ్యక్తిగత కార్యదర్శి బ్యారీ మెక్‌ఫెర్సన్ ధృవీకరించారు. ట్రీట్ విలియమ్స్ అకాల మరణం పట్ల హాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోన్నారు. సంతాపాన్ని తెలియజేస్తోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+