ఎంత పని చేశార్రా ?..ఇజ్రాయెల్ పై మండిపడ్డ ట్రంప్-WTF మెసేజ్..!

ఇజ్రాయెల్ మాట విని ఇరాన్ (Iran)పై యుద్దం ప్రారంభించిన అమెరికాకు ఇప్పుడు అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఒత్తిడిని తట్టుకోవడం కష్టంగా మారుతోంది. ముఖ్యంగా ఇరాన్ చమురు క్షేత్రాలపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు, అలాగే గల్ఫ్ దేశాల చమురు రిఫైనరీలపై ఇరాన్ జరుపుతున్న ప్రతీకార దాడులు ట్రంప్ కు యుద్ధంలో కొత్త సమస్యలు సృష్టిస్తున్నాయి. వీటి కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధర 200 డాలర్లకు చేరుకోవచ్చన్న ఆందోళనలు మొదలయ్యాయి.

ఇదే క్రమంలో తాజాగా ఇరాన్ లోని చమురు క్షేత్రాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడులపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ట్రంప్ వైట్ హౌస్ (white house)కార్యాలయం ఇజ్రాయెల్ పై ఘాటు వ్యాఖ్యలతో WTF (what the fuck) మెసేజ్ పంపినట్లు ఆక్సియోన్ వార్తా సంస్థ తాజాగా అమెరికా అధికారుల్ని కోట్ చేస్తూ నివేదించింది. ఈ వారాంతంలో ఇరానియన్ చమురు నిల్వ కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు భారీ మంటలకు కారణమయ్యాయి. ఇందులో నలుగురు మరణించారు.

After Iran Oil Field Attack White House Reportedly Sent Blunt WTF Message to Israel

ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఇది తొలి ప్రధాన విభేదమని తెలుస్తోంది. ఈ దాడులపై ఇజ్రాయెల్ అమెరికాకు నివేదిక ఇచ్చింది. క్షిపణి ప్రయోగాలకు ఇంధనంగా ఇరాన్ ఈ సౌకర్యాలను వాడుతోందని ఇజ్రాయెల్ పేర్కొంది. కానీ దాడులు అమెరికా ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా జరిగాయని తెలుస్తోంది. వీటిని చూసి అమెరికా సైన్యం ఆశ్చర్యపోయిందని, 'ఇది మంచి ఆలోచన అని తాము అనుకోవట్లేదని ఇజ్రాయెల్ కు తేల్చేచెప్పేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్, చుట్టుపక్కల ఉన్న 3 చమురు డిపోలు,, ఒక శుద్ధి కర్మాగారంపై ఇజ్రాయెల్ దాడి చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+