Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గ్రీన్ కార్డు రాత్రికి రాత్రే రద్దవుతుందా ? భారతీయ అమెరికన్లలో కొత్త టెన్షన్..! వాస్తవమిదే..!

అమెరికాలో శాశ్వత పౌరసత్వానికి ఇన్నాళ్లూ చిహ్నంగా ఉన్న గ్రీన్ కార్డులపై దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా చేసిన వ్యాఖ్యలు విదేశీయుల్లో కొత్త భయాలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా అక్కడ లక్షలాదిగా ఉన్న భారతీయుల్లో ఇవి టెన్షన్ పెంచేస్తున్నాయి. గతంలో గ్రీన్ కార్డు ఉంటే చాలు అనుకునే పరిస్ధితి నుంచి ఇప్పుడు ఉన్న గ్రీన్ కార్డు కాపాడుకుంటే చాలు అన్నట్లుగా అక్కడ పరిస్ధితి మారిపోతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ సర్కార్ తాజా నిర్ణయం భారతీయుల్లో టెన్షన్ పెంచేస్తోంది.

అమెరికాలో శాశ్వత నివాసానికి, పౌరసత్వానికి ఆధారంగా ఉన్న గ్రీన్ కార్డుల్ని ప్రభుత్వం ఎప్పుడైనా రద్దు చేసే అధికారం ఉందంటూ జేడీ వాన్స్ చేసిన ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి గ్రీన్ కార్డులు పొందిన వారిని గుర్తించి వారిని వెనక్కి పంపుతారని భావించగా.. ఇప్పుడు సక్రమంగా అన్ని అనుమతులతో వచ్చి గ్రీన్ కార్డులు తీసుకున్నవారిని సైతం వెనక్కి పంపుతామన్న జేడీ వాన్స్ సంకేతాలు భారతీయులు షాక్ గా మారుతున్నాయి.

after jd vance s comments on green card fears in Indians in US but here is fact

అమెరికా అధ్యక్షుడు ఒకరి గ్రీన్ కార్డ్‌ను నేరుగా రద్దు చేయలేకపోయినా, పరిపాలన విధానాలు, అమలు ప్రాధాన్యతలు శాశ్వత నివాసితులకు, ముఖ్యంగా సంక్లిష్టమైన వలస చరిత్రలు ఉన్నవారికి ఇబ్బందుల్ని సృష్టించే అవకాశాలు ఉన్నాయని ఇమ్మిగ్రేషన్ నిపుణులు చెప్తున్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక నిబంధనల్లో చేస్తున్న మార్పులతో వలసదారులు ప్రభుత్వ సహాయంపై ఆధారపడే అవకాశాలు సంక్షిష్టంగా మారుతున్నాయి. అలాగే కొత్త వీసా దరఖాస్తుదారులను పరిమితం చేయడం, హోదాలను సర్దుబాటు చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ సాగుతున్నా.. గ్రీన్ కార్డు దారుల్లోనూ భయాలు మొదలయ్యాయి.

వాస్తవానికి అమెరికాలో ప్రస్తుత నిబంధనల ప్రకారం ఇష్టారాజ్యంగా గ్రీన్ కార్డుల్ని రద్దు చేయడం సాధ్యం కాదు. కానీ ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ చట్టంలో ఉన్న నిబంధనలను మించి చేపడుతున్న చర్యలతో గ్రీన్ కార్డుల రికార్డుల పరిశీలన జరుగుతోంది. దీంతో గతంలో చట్టపరమైన సమస్యలు ఎదుర్కొన్న వారు, దీర్ఘకాల శాశ్వత నివాసితులు, చిన్న చిన్న ఇమ్మిగ్రేషన్ రూల్స్ ఉల్లంఘనలు ఉన్నవారిలో ఇప్పుడు టెన్షన్ పెరుగుతోంది. ముఖ్యంగా గ్రీన్ కార్డులు ఉన్న వారు తమ దేశాలకు వెళ్తే తిరగి అమెరికాలోకి అనుమతిస్తారో లేదో అన్న ఆందోళనలు పెరుగుతున్నాయి.

Take a Poll

అమెరికాలో గ్రీన్ కార్డును అక్కడ శాశ్వత నివాసానికి, పని చేసే హక్కు కల్పించేందుకు జారీ చేసినా, ఇది కూడా చట్ట నిబంధనలకు లోబడే ఉంటుంది. కాబట్టి తీవ్రమైన నేరారోపణలు, నివాసం పొందడంలో మోసం లేదా ఎక్కువ కాలం అమెరికాలో నివాసాల్ని వదిలివెళ్లడం వంటి చర్యలకు పాల్పడితే గ్రీన్ కార్డు రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. అలాంటి సందర్భాలలో కూడా తగిన చట్ట ప్రక్రియ వర్తిస్తుంది.

ట్రంప్‌తో సహా ఏ అధ్యక్షుడు కూడా చట్టపరమైన చర్య లేకుండా ఎవరికైనా వారి గ్రీన్ కార్డ్‌ను తీసేయడం కష్టం. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ కోర్టులు ఈ వ్యవహారాల్ని చూస్తాయి. గ్రీన్ కార్డ్ హోల్డర్లు ఇమ్మిగ్రేషన్ జడ్జి ముందు హాజరై తమకు మద్దతుగా వాదనలు వినిపించుకోవచ్చు. దీన్ని బట్టి చూస్తే తమ నివాసంలో ఉంటూ చట్టాన్ని పాటించే వారికి, గ్రీన్ కార్డ్ హోదా సాధారణంగా సురక్షితం. కానీ గత సమస్యలు లేదా ప్రయాణ చరిత్ర గురించి ఖచ్చితంగా తెలియని ఎవరికైనా, వారి హక్కులు, నష్టాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఇమ్మిగ్రేషన్ న్యాయవాదితో మాట్లాడటం మంచిదని నిపుణులు చెప్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+