వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విట్టర్ తర్వాత ఎలాన్ మస్క్ మరో భారీ ప్లాన్-కోకా కోలాపై కన్ను-అందులో కొకైన్ తిరిగి తెస్తానంటూ

|
Google Oneindia TeluguNews

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరో సంచలనానికి తెరదీస్తున్నారు. ఇప్పటికే ట్విట్టర్ కొనుగోలు చేస్తానని చెప్పి మరీ చేసి చూపించిన మస్క్.. ఈసారి శీతలపానీయాల సంస్ధ కోకా కోలాను స్వాధీనం చేసుకునేందుకు అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు త్వరలో తాను కోకా కోలాను కొనుగోలు చేయబోతున్నట్లు ట్వీట్ చేశారు. దీంతో మస్క్ వ్యూహాలపై ప్రపంచం ఆసక్తిగా దృష్టిసారిస్తోంది.

మస్క్ చేతుల్లోకి ట్విట్టర్

మస్క్ చేతుల్లోకి ట్విట్టర్

ట్విట్టర్ ను చూసి మురిసిపోయి అలాగే ఓ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ తీసుకొద్దామని భావించిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ఆ తర్వాత వ్యూహం మార్చుకుని ట్విట్టర్ నే కొనేస్తానని సంచలన ప్రకటన చేశారు. ఆ తర్వాత నిజంగానే ట్విట్టర్ పై కన్నేసి వ్యూహాత్మకంగా పావులు కదిపారు.

అనుకున్నట్లుగానే రెండు రోజుల క్రితం మస్క్ ట్విట్టర్‌లో 100 శాతం వాటాను సుమారు 44 బిలియన్ డాలర్లకు కొనేశారు. ఒక్కో షేరుకు దాదాపు 54.20 డాలర్లకు కొనడమే కాకుండా అన్నింటినీ నగదు రూపంలో తీసుకున్నారు. దీంతో ట్విట్టర్ బ్రాండ్ వ్యాల్యూ అమాంతం పెరిగింది.

 ఈసారి కోకా కోలాపై కన్ను

ఈసారి కోకా కోలాపై కన్ను

ట్విట్టర్ ను అనుకున్న తరహాలోనే కైవసం చేసుకోవడంలో సక్సెస్ అయిన ఎలాన్ మస్క్ ఈసారి బహుళజాతి శీతల పానీయాల సంస్ధ కోకా కోలాపై కన్నేశారు. కోకా కోలాను కొనుగోలు చేయడమే తన తదుపరి వ్యూహమని ట్విట్టర్ వేదికగా ఎలాన్ మస్క్ ప్రకటన చేశారు. అంతే కాదు కోకా కోలాలో కొకైన్ తిరిగి తెస్తానంటూ ప్రకటించి సంచలనం రేపారు.

దీంతో ఇప్పుడు మస్క్ దూకుడు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. కోకా కోలాను కూడా మస్క్ స్వాధీనం చేసుకుంటే ఇక శీతల పానీయాల మార్కెట్లో మరిన్ని సంచలనాలు తప్పవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 కోకా కోలాలో కొకైన్ కథ

కోకా కోలాలో కొకైన్ కథ

ట్విట్టర్ లో ఎలాన్ మస్క్ పెట్టిన ట్వీట్ లో కోకా కోలాను తీసుకుంటానని, అందులో తిరిగి కొకైన్ తెస్తానని చేసిన ప్రకటనపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దీని వెనుక పెద్ద కథే ఉంది. వాస్తవానికి కోకా కోలా పేరు వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. కోకా ఆకులు, కోలా గింజలు కలిపితే కోకా కోలా అని పేరు పెట్టారు. కోలా గింజలు కెఫిన్ మూలంగా భావిస్తారు.

అలాగే కోకా ఆకుల నుంచి సైకోయాక్టివ్ డ్రగ్ కొకైన్ లభిస్తుంది. దీంతో కొకైన్‌తో కూడిన కోకా ఆకులు కార్బోనేటేడ్ శీతల పానీయాల ఫార్ములాలో అంతర్భాగంగా ఉండేవి. పంతొమ్మిదవ శతాబ్దంలో కనుకొన్న ఈ పదార్ధాన్ని ఇప్పటికీ ఔషధంగా వాడుతున్నారు.

అయినప్పటికీ, దీనిపై ఎన్నో వివాదాలున్నాయి. యూఎస్ లో కోకా-కోలా ఫార్ములా నుంచి కొకైన్ ను ఎప్పుడో తొలగించారు. దానికి బదులుగా డీకోకైనైజ్డ్ కోకా ఆకులతో దాన్ని తయారు చేస్తున్నారు. ఇప్పుడు కోకా కోలాలో తిరిగి కొకైన్ తెస్తానంటూ మస్క్ చేసిన ట్వీట్ తో దీనిపై తిరిగి చర్చ మొదలైంది.

English summary
billionaire elon musk has now announced to buy coca-cola soon after twitter takeover.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X