సొమాలియా ఎయిర్‌పోర్ట్‌లో పేలుళ్లు: పది మంది మృతి
మొగదిష్: సోమాలియా రాజధాని మొగదీష్‌లో మంగళవారం భారీ పేలుళ్లు సంభవించాయి. మొగదీష్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి సమీపాన ఈ బాంబు పేలుళ్లు సంభవించడం పెను కలకలం రేపింది. కారులో వచ్చిన ఆత్మాహుతి దళ సభ్యుడొకరు తనను తాను పేల్చుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ బాంబు పేలుడు ఘటనలో 8 మంది పౌరులు మృతి చెందినట్లుగా వెల్లడించారు. బాంబు పేలుడు ఘటనతో నగరం మొత్తం తెల్లని పొగతో కప్పబడింది. రెండు గ్రూపులుగా మొగదీష్‌కు చేరుకున్న ఉగ్రవాదులు తొలుత విమానాశ్రయ సమీపంలో ఆత్మాహుతి దాడికి పాల్పడగా, ఆ తర్వాత మరికొంద మంది ఉగ్రవాదులు సోమాలియా గవర్నమెంట్ ఫోర్సెస్ చెక్‌పోస్ట్ వద్ద కాల్పులకు తెగబడ్డారు.

పేలుళ్ల అనంతరం దుండగులు కాల్పులు జరిపారని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఉగ్రవాదులను, సైనికులకు మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ పేలుడుకు తమదే బాధ్యత అని ఆల్ షెబాబ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది.
విమానాశ్రయం వద్ద రెండు భారీ పేలుళ్లు సంభవించాయని, ఆ ప్రాంతంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయని స్థానికులు చెబుతున్నారు. ఈ బాంబు పేలుళ్లపై ఆఫ్రియా యూనియన్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ఉగ్రవాదులు తమ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు.
ఈ బాంబు పేలుళ్ల ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
At least 8 dead in bomb blasts in #Mogadishu; militant group al-Shabab says it carried out attacks https://t.co/HBSwyUG2T0
— BBC Breaking News (@BBCBreaking) July 26, 2016
More photos of Tuesday's twin explosion outside #AMISOM's main base in #Somalia. #Mogadishu. pic.twitter.com/cBwtMJ3wzI
— Abdulaziz Billow Ali (@AbdulBillowAli) July 26, 2016
@HarunMaruf Huge explosion near Medina Gate at Aden Adde International Airport!! pic.twitter.com/IkiQFU9Azo
— Kamal Gutale (@KamalGutale) July 26, 2016
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications