Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పుతిన్ మరోసారి ఆపన్న హస్తం అందిస్తారా?

Russia: సుదీర్ఘకాలంగా పొరుగుదేశం ఉక్రెయిన్‌తో పోరాటాన్ని సాగిస్తోంది రష్యా. 2022 ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన ఈ యుద్ధం రోజుల తరబడి సాగుతోంది. ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు. చిన్న దేశమే అయినప్పటికీ రష్యా దూకుడును సమర్థవంతంగా అడ్డుకుంటోంది ఉక్రెయిన్. అమెరికా సహా ఇతర పాశ్చాత్యదేశాలు అందిస్తోన్న సైనిక, ఆర్థిక సహకారంతో యుద్ధం కొనసాగిస్తోంది.

ఈ పరిస్థితుల మధ్య రష్యా దృష్టి మళ్లినట్టే కనిపిస్తోంది. ఉక్రెయిన్‌తో పాటు సిరియాపైనా ఫోకస్ పెట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. అంతర్యుద్ధంతో సతమతమౌతోన్న సిరియా రెండో అతిపెద్ద నగరం అలెప్పోను తిరుగుబాటుదారులు మళ్లీ తమ ఆధీనంలోకి తెచ్చుకున్న నేపథ్యంలో రష్యా ఇటు దృష్టి సారించిందని అంటున్నారు.

Aleppo has once again thrown Russia s role in the Syrian conflict

అలెప్పోలో ఉన్న సైనిక శిబిరాలు, ఇతర కార్యాలయాలపై రష్యా చిత్రాలు విస్తృతంగా కనిపిస్తోన్నాయి. రష్యా- సిరియా జాతీయ పతకాలు రెపరెపలాడుతున్నాయి. పైగా.. అలెప్పో నుంచి తన సైన్యాన్ని సిరియా అధ్యక్షుడు బషర్ అల్- అస్సద్ ఉపసంహరించుకోవడం సైతం ఈ అనుమానాలకు మరింత బలాన్ని ఇస్తోన్నాయి. అలెప్పో విషయంలో రష్యా- సిరియా దేశాల మధ్య సహకారం బరింత బలపడిందనే సంకేతాలను పంపించాయి.

కొద్దిరోజులుగా అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న నగరం.. అలెప్పో. ఇక్కడి నుంచి బషర్ అల్-అస్సద్ తన బలగాలు ఆకస్మికంగా ఉపసంహరించుకోవడం, అక్కడ రష్యా పతాకాలు రెపరెపలాడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. సిరియా కన్‌ఫ్లిక్ట్‌లో రష్యా ఆపన్న హస్తం అందించవచ్చనే విషయాన్ని మరోసారి రుజువు చేసినట్టయింది.

సిరియా అంతర్యుద్ధంలో అత్యంత వ్యూహాత్మక, కీలక నగరం అలెప్పో. 2012- 2016 మధ్య సాగిన భీకర పోరాటానికి ప్రత్యక్ష సాక్షి ఈ సిటీ. అంతర్యుద్ధంతో అట్టుడికిన అలెప్పోను తిరుగుబాటుదారుల చెర నుంచ విముక్తి కల్పించింది రష్యా. ఆ దేశ వైమానిక బలగాల సహకారంతో ఈ నగరాన్ని సిరియా బలగాలు 2016లో తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి.

ఈ పరిణామం- ప్రపంచ దేశాలకు రష్యా సత్తాను చాటి చెప్పినట్టయింది అప్పట్లో. ఇటీవలి కాలంలో అక్కడ మళ్లీ అంతర్యుద్ధం మొదలైంది. అలెప్పోలో తిరుగుబాటుదారులు తిష్ట వేశారు. రష్యా తన సైన్యాన్ని వెనక్కి పిలిపించుకొన్న కొద్ది కాలంలోనే అలెప్పో వారి వశం కావడం ఊహించని పరిణామంగా చెప్పుకోవచ్చు. రక్షణపరంగా రష్యాపై సిరియా ఎంతగా ఆధారపడిందో ఈ పరిణమా తేటతెల్లం చేసినట్టయింది.

Aleppo has once again thrown Russia s role in the Syrian conflict

2015లో సిరియాలో రష్యా సైన్యం జోక్యం చేసుకున్న తరువాత అలెప్పో రూపురేఖలు సమూలంగా మారిపోయాయి. తిరుగుబాటుదారులను తరిమికొట్టడానికి భారీ ఆపరేషన్ చేపట్టింది క్రెమ్లిన్. ఇది విజయవంతం కావడమే కాకుండా అస్సద్ పరిపాలనను మరింత సుస్థిరం చేసింది. అటు మధ్యప్రాచ్య దేశాల్లో రష్యా తన సైనిక శక్తిని చాటుకోవడానికీ ఓ వేదికగా మారినట్టయింది.

అలెప్పోను వేర్పాటు, తిరుగుబాటుదారుల నుంచి విముక్తి చేయడంలో తాము నిర్మాణాత్మక పాత్ర అప్పట్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైతం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో రష్యాకు చెందిన ప్రైవేట్ ఆర్మీ వాగ్నర్ గ్రూప్ కీలకంగా వ్యవహరించింది. యెవ్‌గెని ప్రిగోజిన్ నేతృత్వంలో వాగ్నర్ గ్రూప్‌, రష్యన్ పారామిలిటరీ బలగాలు అలెప్పోను తిరుగుబాటుదారుల నుంచి విముక్తి కల్పించాయి.

35 సంవత్సరాల కిందట ఆఫ్ఘనిస్తాన్‌ తరువాత ఆ స్థాయిలో సుదీర్ఘకాలం ఓ పొరుగుదేశానికి సహకరించడం రష్యాకు అదే తొలిసారి. దీని తరువాత పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. బషర్ అల్- అసద్ పరిపాలపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతో ఇప్పుడు మళ్లీ అంతర్యుద్ధం మొదలైందక్కడ.

అక్కడ రష్యా తన సైనిక బలగాలను ఉపసంహరించుకున్న తరువాత శరవేగంతో అలెప్పో సిటీపై తిరుగుబాటుదారులు ఆధిపత్య ప్రదర్శించడం, అలెప్పో మిలిటరీ అకాడమీని స్వాధీనం చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ పరిణామం- రష్యా ప్రతిష్ఠకు పెను సవాల్ వంటిదేనని బెర్లిన్‌కు చెందిన జేమ్స్ మార్టిన్ సెంటర్ ఫర్ నాన్‌ప్రొలిఫరేషన్ స్టడీస్‌ మహిళా ప్రతినిధి హన్నా అభిప్రాయపడ్డారు.

అలెప్పో ఊహించనంత వేగంగా పతనం కావడం అత్యంత ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. సిరియా అంతర్యుద్ధంలో రష్యా జోక్యం చేసుకోవడం అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న విషయమని మిడిల్ ఈస్ట్‌లో రష్యన్ విదేశాంగ నిపుణుడు నికితా స్మాగిన్ పేర్కొన్నారు.
సిరియాలో రష్యన్ దళాలకు సారథ్య బాధ్యతలను వహించిన సెర్గీ కిసెల్‌ను తొలగించడం దీనికి ప్రధాన కారణమని, ఈ భూభాగాన్ని శరవేగంగా సిరియా కోల్పోవడం అనేది మరింత ఆందోళనను కలిగించే అంశమని హన్నా వ్యాఖ్యానించారు.

అసద్‌కు సహకరించడానికి రష్యా ఇప్పటికీ కట్టుబడి ఉన్నప్పటికీ.. ఉక్రెయిన్‌తో సుదీర్ఘ యుద్ధం నేపథ్యంలో ఆ దేశ సైనిక సామర్థ్యం చాలా పరిమితంగా ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తోన్నారు. తిరుగుబాటుదారుల ఆధీనంలోకి వెళ్లిన అలెప్పోను తిరిగి సిరియాకు అప్పగించడానికి రష్యా వైమానిక దాడులపైనే ఎక్కువగా ఆధారపడాల్సి రావొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+