రష్యా యుద్ధంలో జెలెన్ స్కీ మరణిస్తే..? నెక్ట్స్ ప్రణాళిక ఏంటి ? : అమెరికా కీలక వ్యాఖలు

ఉక్రెయిన్‌లో రష్యా నిరవధిక దాడులు కొనసాగిస్తోంది. బాంబుల మోతతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దూసుకొస్తున్న మిస్సైల్స్‌తో ఏ క్షణం ఎవరి ప్రాణం పోతుందో అనే భయం వెంటాడుతోంది. రష్యా భీకర దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఎటు చూసినా భయానక పరిస్థితులే దర్శనమిస్తున్నాయి. ఒక వైపు శాంతి చర్చలు జరుపుతూనే.. రష్యా వైమానిక దాడులు జరుపుతూ ఉక్రెయిన్‌లో బీభత్సం సృష్టిస్తోంది.

Recommended Video

    Russia Ukraine Conflict : Ukraine విడిచిన Volodymyr Zelensky ? భద్రతపై ఆందోళన | Oneindia Telugu
     ఉక్రెయిన్‌పై దాడులు ముమ్మ‌రం

    ఉక్రెయిన్‌పై దాడులు ముమ్మ‌రం

    రష్యా నుంచి తనకు ముప్పు ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అనేక సార్లు ప్రస్తావించారు. తనను హతమార్చేందుకు రష్యా కిరాయి గూండాలను రంగంలోకి దింపిందని ఆరోపించారు. ఇదే విషయాన్ని పలు అంతర్జాతీయ మీడియాలు కథనాలను కూడా ప్రసారం చేశాయి. యుద్ధానికి ముగింపు పలకాలని ప్రపంచదేశాలు విజ్ఞప్తి చేస్తున్నా.. రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. దాడులను మరింత పెంచారు. త‌మ ల‌క్ష్యం నెర‌వేరేవ‌ర‌కు యుద్ధాన్ని అపేది లేద‌ని స్ప‌ష్టంచేశారు.

    జెలెన్ స్కీ మ‌ర‌ణిస్తే..

    జెలెన్ స్కీ మ‌ర‌ణిస్తే..

    ఈ పరిణామాల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ రష్యా చేతిలో హత్యకు గురైతే నెక్ట్స్ పరిస్థితి ఏంటన్న చర్చ నడుస్తోంది. తాజాగా దీనిపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. జెలెన్‌స్కీ రష్యా చేతిలో హత్యకు గురైనప్పటికీ .. ప్రభుత్వం కొనసాగేలా ఉక్రెయిన్ ప్రజలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారంటూ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ ప్రభుత్వంలోని నాయకత్వం అసాధారణమైందని పేర్కొన్నారు. తాను ఉక్రెయిన్ విదేశాంగ మంత్రితో కూడా మాట్లాడినట్లు తెలిపారు. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు తగిన ప్రణాళిక ఉందని చెప్పుకొచ్చారు

    జెలెన్‌స్కీ ర‌క్షించేందుకు..

    జెలెన్‌స్కీ ర‌క్షించేందుకు..

    ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలిన్‌స్కీ హత్యకు వాగ్నర్ గ్రూపుతో పాటు చెచెన్ స్పెషల్ ఫోర్స్ పలుసార్లు ప్రయత్నించినట్లు పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. వారి ప్రయత్నాలు విఫలమైనట్లు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో జెలెన్ స్కీని రక్షించేందుకు అమెరికాతో పాటు ఐరోపా దేశాలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తమ దేశాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడిని ఆహ్వానించాయి. అటు యుద్ధం సుదీర్గ కాలం కొనసాగితే .. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని ప్రవాసంలో ఏర్పాటు చేసి.. పాలన నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా కీలక అధికారి కీలక విషాయాలను వెల్లడించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+