గాల్లో అమెరికా యుద్ధవిమానం ఎఫ్ 35 మాయం ? గాలింపులో జనం సాయం కోరిన ఆర్మీ..
అమెరికా ఆర్మీకి చెందిన యుద్ద విమానం ఒకటి తాజాగా అదృశ్యమైంది. గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో అత్యవసర పరిస్ధితి ఏర్పడటంతో అధికారులు దాన్ని సరిచేసేందుకు ప్రయత్నిస్తుండగానే అది అదృశ్యమైంది. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ.. ఎఫ్ 35 ఆచూకీ కనిపెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు సహకరించాలని స్ధానిక దక్షిణ కరోలినా పౌరుల్ని సైతం కోరింది. దీంతో ఈ వ్యవహారం అమెరికాలో తీవ్ర కలకలం రేపుతోంది.
దక్షిణ కరోలినాలో యుఎస్ మెరైన్ కార్ప్స్ ఫైటర్ జెట్ ఆదివారం దాని పైలట్ సురక్షితంగా విమానాన్ని టేకాఫ్ చేసిన తర్వాత అదృశ్యమైంది. తప్పిపోయిన ఈ మల్టీ మిలియన్ డాలర్ల విమానాన్ని కనుగొనడంలో సాయం చేయాలని అమెరికా మిలిటరీ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేసినట్లు గార్డియన్ నివేదించింది. మెరైన్ కార్ప్స్ పైలట్ ఆదివారం మధ్యాహ్నం నార్త్ చార్లెస్టన్ మీదుగా F-35 లైట్నింగ్ II జెట్ ప్రమాదానికి గురై ఉంటుందని భావిస్తున్నట్లు సైనిక అధికారులు తెలిపారు.

చార్లెస్టన్ నగరానికి ఉత్తరాన ఉన్న రెండు సరస్సుల చుట్టూ ఫెడరల్ ఏవియేషన్ రెగ్యులేటర్ల సమన్వయంతో శోధిస్తున్నట్లు బేస్ అధికారులు తెలిపారు. ప్రముఖ జాయింట్ బేస్ చార్లెస్టన్ సహాయం కోసం స్థానిక నివాసితులను కోరింది. F-35ని గుర్తించడంలో మా సహాయ బృందాలకు సహాయపడే ఏదైనా సమాచారం మీ వద్ద ఉంటే, దయచేసి బేస్ డిఫెన్స్ ఆపరేషన్స్ సెంటర్‌కు కాల్ చేయండని కోరింది. ఈ మేరకు ట్విట్టర్ ఓ పోస్టు పెట్టింది.
ఈ వార్తలపై స్పందిస్తూ స్థానిక కాంగ్రెస్ మహిళ నాన్సీ మేస్ ట్విట్టర్ లో విమర్శలు చేశారు. ఇప్పుడు తాను ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నానని, మీరు F-35ని ఎలా కోల్పోతారని ప్రశ్నించారు. ట్రాకింగ్ పరికరం ఎందుకు లేదని అడిగారు. ఇప్పుడు ప్రజల సాయం కోరడమేంటని ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. లాక్‌హీడ్ మార్టిన్ తయారు చేసిన విమానాల ధర ఒక్కొక్కటి 80 మిలియన్లు అమెరికా డాలర్లుగా ఉంది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications