
ఆస్ట్రేలియాలో నివసించాలంటే..? రవాణా, భారతీయ షాప్‌లు, సిమ్ కార్డు కొనుగోలు వరకు: వివరాలివే
మెల్‌బోర్న్: మారుతున్న కాలానికి అనుగుణంగా భారతీయ విద్యార్థులు విదేశాల్లో విద్యను అభ్యసించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తోన్నారు. ఆయా దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. కంగారూ గడ్డగా పేరున్న ఆస్ట్రేలియాలో అడుగు పెట్టిన తరువాత ప్రారంభంలో కొంత గందరగోళానికి గురవుతుంటారు. ఎక్కడ ఏమేం దొరుకుతాయనే విషయంలో ఆందోళన చెందుతుంటారు. అలాంటి విద్యార్థుల కోసం పూర్తి సమాచారం ఇదే.

విమానాశ్రయం నుంచి గమ్యస్థానానికి
ఆస్ట్రేలియాలో ల్యాండ్ అయిన తరువాత విమానాశ్రయంలో పికప్ గురించి యూనివర్శిటీల అధికారులు ఏవైనా రవాణా వసతిని ఏర్పాటు చేశాయా అనేది ఆన్‌బోర్డింగ్ పోర్టల్‌లో తనిఖీ చేయాలి. కొన్ని విశ్వవిద్యాలయాలు ఈ సేవలను ఆఫ్ ఎయిర్‌పోర్ట్ పికప్‌గా అందిస్తాయి. ఇది యూనివర్సిటీ ఆఫర్‌లను బట్టి కాంప్లిమెంటరీ సర్వీస్ కావచ్చు. విమానాశ్రయాల నుంచి కారును అద్దెకు తీసుకోవడం అనేది ఖరీదైన వ్యవహారం. లోకల్ ట్రాన్స్‌పోర్ట్ బస్సు లేదా రైలును ఎంపిక చేసుకోవచ్చు.
బ్రిస్బేన్‌లో..
విమానాశ్రయం నుంచి గమ్యస్థానాలకు చేరడానికి అందుబాటులో ఉన్న కొన్ని ప్రజా రవాణా సౌకర్యాల గురంచి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. బ్రిస్బేన్: బ్రిస్బేన్‌లో ఎయిర్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. కాన్-ఎక్స్-అయాన్ పేరుతో విమానాశ్రయం నుంచి డోర్ టు డోర్ ట్రాన్స్‌పోర్ట్ చేసే సౌకర్యాన్ని అందిస్తుంది. స్కైబస్ షటిల్ సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి. దీనికి అవసరమైన టికెట్లను ఆన్‌లైన్‌లో లేదా విమానాశ్రయం వద్ద ఏర్పాటు చేసిన కియోస్క్ ద్వారా తీసుకోవచ్చు.
క్యాన్‌బెర్రాలో..
క్యాన్‌బెర్రా: క్యాన్‌బెర్రాలో రాపిడ్ 3 బస్సు సౌకర్యం, వివిధ షటిల్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. డార్విన్: డార్విన్‌లో సిటీ షటిల్ సర్వీస్‌తో పాటు మెర్క్యూర్ డార్విన్ ఎయిర్‌పోర్ట్ రిసార్ట్ లేదా నోవాటెల్ డార్విన్ ఎయిర్‌పోర్ట్ హోటల్‌లో బస చేస్తే ఉచిత షటిల్ సర్వీస్ లభిస్తుంది. బస్ లింక్ కూడా ఉంటుంది. హోబర్ట్, మెల్‌బోర్న్‌లల్లో స్కై బస్ షటిల్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. వాటి టికెట్లను ఆన్‌లైన్‌లో లేదా విమానాశ్రయం కియోస్క్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

బస్ రూట్స్..
మెల్‌బోర్న్‌లో కాన్-ఎక్స్-అయాన్ సేవలు కూడా లభిస్తాయి. పెర్త్‌లో- బస్ రూట్ 380 సర్వీస్ అందుబాటులో ఉంటుంది. పెర్త్ సిటీ సెంటర్ నుంచి టీ1 మరియు టీ2, బస్ రూట్ 40లో పెర్త్ సిటీ సెంటర్ నుంచి టీ3, టీ4 ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. సిడ్నీలో ఎయిర్‌పోర్ట్ లింక్ రైలు, షటిల్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. బస్ సర్వీస్: రూట్లు 400, 420లను వినియోగించుకోవచ్చు.
సిమ్ కార్డ్ కొనుగోలు చేయడం ఎలా..
ఆస్ట్రేలియాలోని మూడు ప్రధాన టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు టెల్‌స్ట్రా, ఆప్టస్, టీపీజీ మొబైల్ సర్వీసులను అందుబాటులో తెచ్చాయి. వాటి హోస్ట్ నెట్‌వర్క్‌లలో మొబైల్ ప్లాన్‌లను అందించే వాయిస్ డేటా సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నారు. సిమ్ కార్డ్‌లను విమానాశ్రయం వద్ద కొనుగోలు చేయవచ్చు లేదా ఆన్‌లైన్‌లో కూడా ఆర్డర్ చేయవచ్చు. అలాగే లోకల్ అడ్రస్‌కు కూడా డెలివరీ చేయించుకునే వెసలుబాటు ఆస్ట్రేలియాలో ఉంది.
ఆహారం
కొత్త దేశం, కొత్త వాతావరణంలో స్థిరపడాల్సి వచ్చినప్పుడు ఆహార సమస్య ఎదురవుతుంది. దీనికోసం- రెడీమేడ్ ఫుడ్‌తో పాటు గుడ్లు, బ్రెడ్, వెన్న, ఉప్పు, మిరియాలు కొనుగోలు చేయడం మంచిది. జెట్ లాగ్ నుంచి కోలుకునేటప్పుడు ఎక్కువ శ్రమ అవసరం లేని సులభమైన ఆహారాలు సరైనవి. అక్కడ కనీస ఉష్ణోగ్రత ఎనిమిది డిగ్రీల వరకు నమోదవుతుంటుంది. దీనికి అనుగుణంగా మనం ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రజా రవాణాలో తిరగాలంటే..?
ప్రజా
రవాణాలో
పలు
రకాల
కార్డులు
అందుబాటులో
ఉన్నాయి.
బ్రిస్బేన్‌లో
ట్రాన్స్‌లింక్,
గో
కార్డ్
ద్వారా
రైళ్లు,
ట్రామ్,
బస్సులు,
ఫెర్రీల్లో
ప్రయాణించవచ్చు.
కాన్‌బెర్రాలో
యాక్ట్:మై
వే
అందుబాటులో
ఉంటుంది.
ఈ
కార్డు
ద్వారా
బస్సుల్లో
ప్రయాణించవచ్చు.
డార్విన్‌లో
ట్యాప్
అండ్
గో
కార్డ్
ద్వారా
బస్సుల్లో
తిరుగాడవచ్చు.
అందుబాటులో ఉండే ట్రావెలింగ్ కార్డులివే..
హోబర్ట్‌లో మెట్రో టాస్మానియా: గ్రీన్‌కార్డ్‌ను కొనుగోలు చేయడం ద్వారా బస్సుల్లో రాకపోకలు సాగించవచ్చు. మెల్‌బోర్న్‌లో పీటీవీ: మైకి కార్డును తీసుకుని రైళ్లు, ట్రామ్, బస్సుల్లో తిరగొచ్చు. పెర్త్‌లో ట్రాన్స్‌పెర్త్: స్మార్ట్ రైడర్ కార్డు ద్వారా రైళ్లు, బస్సులు, ఫెర్రీల్లో ప్రయాణించవచ్చు. సిడ్నీలో- ఒపాల్ కార్డుతో రైళ్లు, ట్రామ్‌లు, బస్సులు, ఫెర్రీల్లో తిరగాడవచ్చు.
బ్యాంక్ అకౌంట్ ఎలా..
ఆస్ట్రేలియాలో చదువుకోదలిచినప్పుడు వీలైనంత త్వరగా బ్యాంక్ ఖాతాను ఏర్పరచుకోవాలి. దీనికి అవసరమైన బ్యాంకుల వివరాలను పరిశీలిస్తే- కామన్వెల్త్ బ్యాంక్, ఎన్ఏబీ, ఏఎన్‌జెడ్, వెస్ట్‌పాక్ బ్యాంక్‌లను పరిశీలనలోకి తీసుకోవచ్చు.

ఆస్ట్రేలియాలో ఇండియన్ షాప్స్..
ఆస్ట్రేలియాలో
ఉన్న
భారతీయ
షాపుల
గురించిన
వివరాల్లో
బ్రిస్బేన్‌లో
ఆల్
ఇన్
వన్
గ్రోసరీ
స్టోర్
498-
Ipswich
Rd,
అన్నెర్లీలో
ఉంది.
ఇండియన్
స్పైస్
షాప్
చెర్మిసైడ్
763
జింపీ
రోడ్,
మోనికా
ఇండియన్
గ్రోసరీస్,
కేడ్రాన్
స్పైస్
సెంటర్,
ఇండియన్
స్పైస్
షాప్
ఉన్నాయి.
కాన్‌బెర్రాలో
న్యూ
స్పైస్
వరల్డ్,
అప్నా
ఇండియన్
బజార్,
స్పైస్
మార్కెట్
యాక్ట్,
ఇండియన్
మెగా
మార్ట్
ఉన్నాయి.
ది
ఛిల్లీ
ఛాయిస్,
మోలి
సూపర్
మార్కెట్
అండ్
ఇండియన్
గ్రోసరీ,
సీఏఎస్
స్పైస్డ్
వంగూరి
షాప్స్
డార్విన్‌లో
ఉన్నాయి.

హోబర్ట్‌లో..
హోబర్ట్‌లో స్పైస్ వరల్డ్, ది స్పైస్ షాప్, యువర్ మినీ మార్ట్, మూన్‌లైట్ నేపాలీస్ అండ్ ఇండియన్ గ్రోసరీ షాప్, మెల్‌బోర్న్‌లో మెల్‌బోర్న్ గ్రోసరీస్, లెట్స్ సేవ్ కన్వీనియన్స్ అండ్ ఇండియన్ కిరాణా షాప్, స్పైస్ ల్యాండ్ డాక్‌ల్యాండ్స్, కర్రీ కార్నర్, ఎక్సెల్ ఫుడ్ మార్ట్, అప్నా దేశీ ఇండియన్ గ్రాసరీ షాప్స్ ఉన్నాయి.

పెర్త్‌లో
పెర్త్‌లో స్పైసీ వరల్డ్, స్పైసీ టచ్, క్వాలిటీ ఇండియన్ గ్రాసరీస్, స్పైసీ హబ్ హౌస్ ఆఫ్ ఇండియన్ గ్రోసరీస్, మహారాజా స్టోర్స్ ఉన్నాయి. సిడ్నీలో ఎంజీఎం స్పైసీస్, న్యూ ఇండియన్ హౌస్ సర్రే హిల్స్, యష్ ఇండియన్ స్పైస్ ఎన్ డిలైట్స్, ఖాట్మండు కన్వీనియన్స్ స్టోర్‌లు అందుబాటులో ఉన్నాయి. మరింత తెలుసుకోవడానికి Edudha ప్లాట్‌ఫారంలో పేరు, తమ వివరాలను ఈ రోజే నమోదు చేసుకోండి.