భారతీయులకు ట్రంప్ బిగ్ షాక్..! వర్క్ పర్మిట్లపై సంచలన నిర్ణయం..!

అమెరికాలో రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి వలసదారులపై ఉరుముతున్న డొనాల్డ్ ట్రంప్ ఇదే క్రమంలో భారతీయుల్ని లక్ష్యంగా చేసుకుంటూనే ఉన్నారు. ఇదే క్రమంలో అక్రమ వలసదారుల్ని గుర్తించి బలవంతంగా స్వదేశాలకు పంపేయడంతో పాటు వారిని నిర్బంధించడం, వీసాలు రద్దు చేయడం, వీసా ఫీజుల పెంపు వంటి నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా భారతీయులతో పాటు వలసదారులకు ట్రంప్ మరో భారీ షాక్ ఇచ్చారు.

వర్క్ పర్మిట్లకు షాక్

ఎంప్లాయ్ మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ)గా పేర్కొనే వలసదారుల వర్క్ పర్మిట్లను ఇప్పటివరకూ ఆటోమేటిగ్గా రెన్యువల్ చేస్తుండగా.. ఇప్పుడు దాన్ని నిలిపేస్తూ ట్రంప్ సర్కార్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం అమెరికాలో భారీగా వలస వచ్చి ఉంటున్న భారతీయులతో పాటు ఇతర విదేశీ ఉద్యోగులుపై తీవ్ర ప్రభావం చూపబోతోంది. అక్టోబర్ 30 (ఇవాళ) లేదా ఆ తర్వాత ఈఏడీని ఆటోమేటిగ్గా పొడిగించడం ఉండదని అక్కడి హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

another shocker to Indians in US as trump administration ends automatic work permits for migrants

అక్టోబర్ 30కు ముందు రెన్యువల్స్ కు

అయితే అక్టోబర్ 30కి ముందు అంటే నిన్నటి వరకూ ఇలా ఆటోమేటిగ్గా రెన్యువల్ చేసిన ఈఏడీల విషయంలో మాత్రం ఈ ఉత్తర్వులు వర్తించబోవని డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ క్లారిటీ ఇచ్చింది. తాజా నిబంధనల నేపథ్యంలో అమెరికాలో ఉంటున్న వలసదారులపై మరోసారి భారీ ఎత్తున తనిఖీలు చేయబోతున్నారు. ప్రజా భద్రత కోసం మరింతగా తనిఖీలు చేయబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

బైడెన్ మినహాయింపుకు చెక్

వాస్తవానికి వలసదారులు వారి వర్క్ పర్మిట్ గడువు ముగిసిన తర్వాత కూడా 540 రోజుల పాటు అమెరికాలో ఉండేందుకు, పనిచేసేందుకు గతంలో బైడెన్ ప్రభుత్వం అనుమతించింది. ఇప్పుడు ట్రంప్ సర్కార్ తాజా ఉత్తర్వులతో ఆ నిబంధన రద్దు కానుంది. గతంలో ఈఏడీ ఆటోమేటిక్ పొడిగింపు కోసం దరఖాస్తు సకాలంలో చేసుకుంటే, అలాగే ఆయా ఉద్యోగుల ఈఏడీ కేటగిరీ ఆటోమేటిక్ పొడిగింపుకు అర్హత ఉంటే ఇలా 540 రోజుల పాటు దేశంలో ఉండేందుకు అవకాశం ఉండేది.

another shocker to Indians in US as trump administration ends automatic work permits for migrants

ఈఏడీ వీరికి అక్కర్లేదు..!

వర్క్ పర్మిట్ గా పేర్కొనే ఈఏడీని కలిగి ఉండటం అనేది ఒక వ్యక్తికి అమెరికా నిర్దిష్ట కాలానికి పని చేయడానికి హక్కు ఉందని నిరూపించడానికి ఒక మార్గం. శాశ్వత నివాసితులు ఈఏడీ కోసం దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు. గ్రీన్ కార్డ్ (ఫారం I-551, శాశ్వత నివాసి కార్డ్) ఉపాధి హక్కుకు రుజువుగా పనికొస్తుంది. వలసేతర హోదా (H-1B, L-1B, O లేదా P) ఉన్న వ్యక్తులకు కూడా ఈ పత్రం అవసరం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+