‘ఐఫోన్ ఎక్స్’లో.. అద్భుతమైన ఫీచర్ ఏమిటో తెలుసా?
టెక్ దిగ్గజం ఆపిల్ తన పదో వార్షికోత్సవం సందర్భంగా విడుదల చేసిన ‘ఐఫోన్ ఎక్స్’ లో అద్బుతమైన ఫీచర్ ఏమిటో మీకు తెలుసా? ‘ఫేస్ ఐడీ’ ఫీచర్. అవును, ఆపిల్ లేటెస్ట్ ఫోన్ లో ఈ ఫీచర్ అందరినీ అబ్బురపరుస్తోంది.
వాషింగ్టన్: టెక్ దిగ్గజం ఆపిల్ తన పదో వార్షికోత్సవం సందర్భంగా విడుదల చేసిన 'ఐఫోన్ ఎక్స్' లో అద్బుతమైన ఫీచర్ ఏమిటో మీకు తెలుసా? 'ఫేస్ ఐడీ' ఫీచర్. అవును, ఆపిల్ లేటెస్ట్ ఫోన్ లో ఈ ఫీచర్ అందరినీ అబ్బురపరుస్తోంది.
భారత్‌లో ఈనెల 3వ తేదీ నుంచి 'ఐఫోన్ ఎక్స్' వినియోగదారులకు లభించనుంది. అనేక అత్యాధునిక ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.89 వేలు. గతంలో ఉన్న ఫింగర్ ప్రింట్ స్కానర్ స్థానంలో ఇందులో తొలిసారిగా 'ఫేస్ ఐడీ' ఫీచర్‌ను తీసుకొస్తున్నారు.

ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో పోలిస్తే 'ఫేస్ ఐడీ'లో తప్పిదాలు జరిగే అవకాశం తక్కువేనంటోంది ఆపిల్. అత్యంత భద్రంగా భావించే ఫింగర్ ప్రింట్ స్కానర్ సదుపాయంలో 50 వేల సందర్భాల్లో ఒకసారి తప్పు జరిగే ఆస్కారముంటే.. ఫేస్ ఐడీలో 10 లక్షల సార్లలో ఒకసారి మాత్రమే తప్పిదానికి ఆస్కారముంటుందట.
అది కూడా ఎప్పుడంటే.. అచ్చం మీలాగే ఉండే వ్యక్తి, ఒకే డీఎన్‌ఏ కలిగిన కవలలు మాత్రం ఐఫోన్ ఎక్స్ లోని ఫేస్ ఐడీ ఫీచర్ ను పక్కదారి పట్టించొచ్చని ఆపిల్ చెబుతోంది. విశేషం ఏమిటంటే.. ఆఫిల్ ఐఫోన్ ఎక్స్ లో ఉన్న ఈ ఫేస్ ఐడీ ఫీచర్ చీకటిలోనూ, అత్యంత వెలుతురులోనూ వినియోగించుకోవచ్చు.
ఒకవేళ ఫోన్ ను అన్‌లాక్ చేసే సమయంలో టోపీగానీ, కళ్లద్దాలు గానీ ధరించినా, ఫోన్‌లో ఉండే ముందు కెమెరా మిమ్మల్ని గుర్తిస్తుందట. ఒకవేళ ఫేస్ ఐడీ గుర్తించకపోతే పాస్‌కోడ్‌తో ఫోన్‌ను అన్‌లాక్ చేయొచ్చు. దీనికోసం ఫేస్ ఐడీని క్రియేట్ చేసేటప్పుడే పాస్‌కోడ్‌ను కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి గతంలోని మోడల్స్ కన్నా ఐఫోన్ ఎక్స్ మరింత సురక్షితం అన్నమాట.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications