చంద్రుడికి అవతలి వైపున ఏముంది?
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన లేటెస్ట్ ప్రాజెక్ట్.. ఆర్టెమిస్ 1 మిషన్ మూన్. ఇందులో భాగంగా చందమామపై ప్రయోగాలను చేయడానికి ఇటీవలే ఒరియన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపించారు నాసా శాస్త్రవేత్తలు. ఇది మానవ రహిత మిషన్. 4.1 బిలియన్ డాలర్ల వ్యయంతో చేపట్టిన ఈ మిషన్ మూన్‌ను విజయవంతం చేశారు. రెండు రోజుల కిందటే ఈ స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. అక్కడ చక్కర్లు కొడుతోంది. ఫ్లోరిడాలోని కెన్నడీ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి దీన్ని చంద్రుడిపైకి పంపించింది.
సెకెనుకు 160 కిలోమీటర్ల వేగంతో చంద్రుడి వైపు దూసుకెళ్లింది ఒరియన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను మోసుకెళ్లిన రాకెట్. చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన వెంటనే అక్కడి డేటాను గ్రౌండ్ స్టేషన్‌కు పంపించడం మొదలు పెట్టింది. తాజాగా చంద్రుడికి అతి సమీపానికి వెళ్లింది. దాని ఉపరితలం ఫొటోలను తీసింది. వీటిని నాసా శాస్త్రవేత్తలు తమ అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై పోస్ట్ చేశారు. చంద్రుడికి అత్యంత సమీపం నుంచి ఈ ఫొటోలను తీసింది ఒరియన్ స్పేస్‌క్రాఫ్ట్.

ఈ ప్రాజెక్ట్ విజయవంతమైన నేపథ్యంలో నాసా మరో మిషన్‌ను చేపట్టింది. ఆర్టెమిస్ 1కు సీక్వెల్‌ను తెర మీదికి తీసుకొచ్చింది. ఆర్టెమిస్ 2 మిషన్‌ను ప్రకటించింది. ఇది మానవ సహిత మిషన్. చంద్రుడిపై పరిశోధనలు సాగించడానికి నలుగురు వ్యోమగాములను అక్కడికి పంపించనుంది. వచ్చే సంవత్సరం నవంబర్/డిసెంబర్‌లో ఆ నలుగురు ఆర్టెమిస్ 2 ఫ్లైట్ ద్వారా చంద్ర మండలానికి చేరుకుంటారు.
ఈ ఫ్లైట్ చంద్రుడిపై ల్యాండ్ కావడం గానీ, కక్ష్యలోకి అడుగు పెట్టడం గానీ చేయదు. చంద్రుడి బాహ్య కక్ష్యకు వెలుపలే తిరుగుతూ అక్కడి డేటాను సేకరిస్తుంది. ఈ మిషన్ కూడా దాదాపుగా ఆర్టెమిస్ 1ను పోలి ఉంటుంది. అది మానవ రహిత మిషన్. ప్రస్తుతం చంద్రుడి చుట్టూ తిరుగుతూ అక్కడి డేటా, ఫొటోలను నాసా గ్రౌండ్ స్టేషన్‌కు పంపిస్తోంది. దీనికి కొనసాగింపుగా ఆర్టెమిస్ 2 ద్వారా మానవ సహిత మిషన్‌ను చేపట్టింది నాసా.
దీని కోసం నలుగురు వ్యోమగాములను ఎంపిక చేసింది. జెరెమీ హాన్సెన్, విక్టర్ గ్లోవర్, రీడ్ వైస్‌మన్ క్రిస్టినా హమ్మక్ కోచ్‌ను నాసా ఎంపిక చేసింది. వీరిలో క్రిస్టీనా ఆఫ్రికన్-అమెరికన్. అమెరికాలో స్థిరపడిన ఆఫ్రికన్ మూలాలు గల మహిళ. ఒక అంతరిక్ష ప్రయోగం కోసం ఆఫ్రికన్-అమెరికన్ మహిళను ఎంపిక చేయడం నాసా చరిత్రలో ఇదే తొలిసారి. ఆర్టెమిస్ 2 ఫ్లైట్ టెస్టింగ్‌ను ఇంకో 10 రోజుల్లో ప్రారంభించనున్నట్లు నాసా తెలిపింది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications