కాబూల్‌లో వరుస పేలుళ్లు: 40 మంది దాకా మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

కాబూల్: అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌లో వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ంఘటనలో కనీసం 40 మంది మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు. పలువురు గాయపడ్డారు. గురువారంనాడు ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి..

తబయాన్ సాంస్కృతిక కేంద్రాన్ని లక్ష్యం చేసుకుని ఈ పేలుళ్లు సంభవించాయి. అఫ్గానిస్తాన్‌పై సోవియట్ దాడికి సంబంధించిన 3వ వార్షిక కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఈ పేలుళ్లు సంభవించాయి.

 At Least 40 Dead In Multiple Kabul Blasts

ఆ కేంద్రం అఫ్గాన్ వాయిస్ ఏజెన్సీకి సమీపంలో ఉంది. ఈ పేలుళ్లకు తాము బాధ్యలమంటూ ఇప్పటి వరకు ఎవరూ చెప్పుకోలేదు. రెండు వరుస పేలుళ్లు సంభవించాయి.

అయితే, మూడో పేలుడు కూడా సంభవించిందని చెబుతున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వచ్చినవారిలో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
At least 40 people were killed and many others wounded in multiple blasts in Kabul on Thursday, officials said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి