పుట్టిన శిశువు తలలో బాంబు శకలాలు(ఫొటో)
డెమాస్కస్: అప్పుడే పుట్టిన పసి పాప తలలో బాంబు శకలాలు వైద్యులు. తలలో శకలాలు ఉన్నప్పటికీ ఆ శిశువు జీవించి ఉండటం విశేషం. వెంటనే చికిత్స చేసి ఆ శిశువు ప్రాణాలు కాపాడారు వైద్యులు.
వివరాల్లోకి వెళితే.. సిరియాలో అంతర్యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే సెప్టెంబర్ 18న సిరియాలో రాకెట్ దాడి జరిగింది. రాకెట్ దాడిలో అమీరా అనే గర్భవతి తీవ్రంగా గాయపడింది.
కాగా, గర్భాశయంలోకి రాకెట్ శకలాలు చొచ్చుకెళ్లాయి. అయితే ఈ క్రమంలో చికిత్స నిమిత్తం గర్భవతి అలెప్పోలోని ఓ ఆస్పత్రికి వెళ్లింది. స్కానింగ్ చేసిన వైద్యులు కడుపులో ఉన్న బిడ్డ తలలో శకలాలు ఉన్నాయని తెలిపారు.

ప్రాణం లేని బిడ్డను ఆపరేషన్ చేసి బయటకు తీయాలని వైద్యులు నిర్ణయించుకున్నారు. కానీ, శకలాలు ఉన్నప్పటికీ ఆ పాప ప్రాణాలతోనే ఉంది. ఆ పాపను చూసిన వైద్యులు ఆశ్చర్యానికి గురయ్యారు.
తలలో శకలం ఉన్నప్పటికీ ప్రాణాలతో శిశువు ఉండటం అద్భుతమేనని తెలిపారు. వెంటనే పాప తలలో నుంచి శకలాలను బయటకు తీసి పాప ప్రాణాలు నిలబెట్టారు. ప్రస్తుతం ఆ శిశువు, తల్లి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications