వామ్మో ఇదేం బీర్‌రా నాయనా.. ఆ జర్నలిస్టుకు మైండ్ బ్లాక్ అయ్యింది..!
మాంచెస్టర్ : సాధారణంగా ఒక్క బీరు ఎంతుంటుంది..మన దేశంలో తయారైనదైతే రూ.120 నుంచి రూ.150 వరకు ఉంటుంది. అదే ఫారిన్ బ్రాండ్ బీర్ అయితే కొన్ని వేల రూపాయలు ఉంటుంది. కానీ ఒక బీరు ధర రూ. 73 లక్షలు ఉండటం ఎక్కడన్నా చూశారా.. పోనీ విన్నారా..? కానీ తాగిన ఒక్క బీరు కిక్కెక్కిందో లేదో కానీ ఆ ఆస్ట్రేలియా స్పోర్ట్స్ జర్నలిస్టు పీటర్ లేలర్‌కు మాత్రం బిల్లును చూశాక నిజంగానే కిక్కెక్కింది.
అసలు వివరాల్లోకి వెళితే... ఓ చల్లని బీరు తాగుదామని ఆస్ట్రేలియా క్రీడా జర్నలిస్టు పీటర్ లేలర్ మాంచెస్టర్‌లోని మాల్‌మైసన్ హోటల్‌కు వెళ్లాడు. అక్కడ ఒక బీరుకోసం ఆర్డరు ఇచ్చాడు. అంతాబాగానే ఉంది. ఇక బిల్లు తీసుకురమ్మని సర్వర్‌కు చెప్పాడు. సర్వర్ బిల్లు తీసుకువచ్చి ఇచ్చాడు. అంతే బిల్లును చూసి మైండ్ బ్లాక్ అయ్యింది పీటర్ లేలర్‌కు. వంద కాదు, వేలు కాదు, ఏకంగా రూ.73 లక్షలు బిల్లు వేయడంతో పీటర్ లేలర్‌కు తాగిందంతా దెబ్బకు దిగింది . ఆస్ట్రేలియా కరెన్సీలో బిల్లు ఏకంగా 99,983.64 ఆస్ట్రేలియన్ డాలర్లు వేశారు.

ఇక ఈ ఫన్నీ ఘటనను పీటర్‌లేలర్ ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్నారు. లేలర్ ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న యాషెస్ టెస్టును కవర్ చేసేందుకు వెళ్లాడు. తను అత్యంత ఖరీదైన బీరును తాగినట్లు ట్విటర్‌లో రాసుకున్నారు. అంతేకాదు తాను తాగిన బీర్‌ను ఫోటో తీసి దాన్ని ట్విటర్‌లో పోస్టు చేశాడు. " ఈ బీరును చూశారా.. ఇది అత్యంత ఖరీదైన బీరు. దీన్ని తాగేందుకు నేను రూ.73 లక్షలు చెల్లించాను" అని రాసుకొచ్చాడు.
See this beer? That is the most expensive beer in history.
— Peter Lalor (@plalor) September 5, 2019
I paid ,983.64 for it in the Malmaison Hotel, Manchester the other night.
Seriously.
Contd. pic.twitter.com/Q54SoBB7wu
ఇక అసలు జరిగిన విషయమేంటంటే.. బీరు తాగాక బిల్లు చెల్లించే సమయంలో సర్వర్ స్వైపింగ్ మెషీన్‌ను తీసుకెళ్లాడు. ఇక మెషీన్‌లో డబ్బులు టైప్ చేయడంలో పొరపాటు చేశాడు. ఇక కార్డును స్వైప్ చేసి పిన్ నెంబర్ నొక్కగానే ఒక్కసారిగా 99,983.64 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ.73 లక్షలు) ఆ హోటల్ ఖాతాలోకి బదిలీ అయిపోయాయి. అయితే తప్పును తెలుసుకున్న హోటల్ యజమాని డబ్బులను తిరిగి చెల్లిస్తామని చెప్పారు. జరిగిన తప్పుకు క్షమించాల్సిందిగా కోరారు. స్వైపింగ్ మిషన్‌లో లోపం తలెత్తడంతోనే ఇలా జరిగి ఉంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications