Bangladesh: హెలికాఫ్టర్ లో పారిపోయిన ప్రధాని హసీనా ! మిలటరీ పాలన దిశగా బంగ్లాదేశ్ ?
రిజర్వేషన్లలో మార్పులతో రగులుకున్న చిచ్చు బంగ్లాదేశ్ లో తీవ్ర ఘర్షణలకు దారి తీసింది. ఇవి కాస్తా ముదరడంతో దాదాపు 300 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో అల్లర్లను అదుపుచేయడంలో విఫలమైన ప్రధాని షేక్ హసీనాపై దేశంలో తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతోంది.
దీంతో ఆమె ప్రాణాలు అరచేత పట్టుకుని విదేశాలకు పారిపోయారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం ఆర్మీఛీఫ్ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దేశంలో ఆర్మీ పాలన విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Big Breaking 🚨🚨
— BigBreakingWire (@BigBreakingWire) August 5, 2024
Sheikh Hasina has stepped down from her role as Prime Minister and has departed from Bangladesh.#Bangladesh
Read more 👇 https://t.co/26Q7wX56U4 https://t.co/kCc0tdcboN pic.twitter.com/QnApCADmxl
బంగ్లాదేశ్ లో స్వాతంత్ర సమరయోధులకు 30 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు షేక్ హసీనా చేసిన ప్రయత్నాలకు సుప్రీంకోర్టు తాజాగా అడ్డుకట్టే వేసింది. అయితే అప్పటికే దేశంలో చెలరేగిన అల్లర్లలో భారీ ఎత్తున జనం చనిపోయారు. పోలీసులు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఇచ్చినా జనం వెనక్కి తగ్గలేదు. దీంతో పోలీసు కాల్పుల్లోనే వందలాది మంది చనిపోయారు. దీంతో ప్రజాగ్రహం మరింత పెరిగింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా హసీనా ప్రభుత్వం రిజర్వేషన్లపై వెనక్కి తగ్గకపోవడంతో ఈ అల్లర్లు మరింత ఎక్కువయ్యాయి. వీటిలో 300 మందికి పైగా చనిపోయారు.
ఇవాళ ప్రధాని హసీనా నివాసాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. అందిన కాడికి దోచుకుని వెళ్లిపోయారు. ఇదంతా ముందే పసిగట్టిన హసీనా తన అధికారిక నివాసాన్ని వీడి పరారయ్యారు. ప్రత్యేక హెలికాఫ్టర్ లో పిన్లాండ్ కు లేదా భారత్ లోని పశ్చిమ బెంగాల్ కు ఆమె పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు దేశంలో ఆందోళనకారుల్ని అణచివేయాలన్న హసీనా కుమారుడి ఆదేశాల్ని ఆర్మీ లెక్కచేయట్లలేదు.
మరోవైపు ఇవాళ రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించేందుకు ఆర్మీ ఛీఫ్ వాకర్ ఉజ్ జమాన్ సిద్దమవుతున్నారు. ఇందులో ఆయన దేశ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. గతంలో పలుమార్లు పాకిస్తాన్ లో జరిగిన తరహాలోనే ఆర్మీ దేశ పాలనను చేతుల్లోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే శ్రీలంకలో గతంలో జరిగిన విధంగానే ప్రధాని నివాసాన్ని ప్రజలు ముట్టడించడం వంటి ఘటనలు చోటు చేసుకోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు నెలకొంటున్నాయి.












Click it and Unblock the Notifications