బూతులు తిట్టినా!: ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిని కలిసిన ఒబామా
వియన్‌టైన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో తీవ్రమైన పదజాలంతో దూషించిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత తాను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసి క్షమాపణలు కోరారు. ఈ నేపథ్యంలో రోడ్రిగో డ్యుటెర్ట్‌ను కలిశారు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.
ఇద్దరు నేతలు కొంతసేపు మాట్లాడుకున్నట్లు ఫిలిప్పైన్స్ విదేశాంగ కార్యదర్శి పర్ఫెక్టో యాసే వెల్లడించారు. లావోస్‌లో జరుగుతున్న ఏషియాన్ సమావేశంలో అన్ని దేశాల నేతల విందు కార్యక్రమానికి ముందు ఈ సమావేశం జరిగినట్లు ఆయన చెప్పారు.
డిన్నర్‌కు ముందు వెయిటింగ్ రూమ్‌లో వాళ్లు కలిశారని, ఆ రూమ్ నుంచి వారే చివరిగా బయటకు వచ్చారని తెలిపారు. అయితే ఇద్దరి మధ్య ఎంతసేపు చర్చ జరిగిందన్నదని తనకు తెలియదని పర్ఫెక్టో అన్నారు. ఇద్దరు నేతలు కలవడం తనకు సంతోషం కలిగించిందని చెప్పారు.

అటు వైట్‌హౌజ్ వర్గాలు కూడా ఇద్దరు నేతల మధ్య కాసేపు చర్చ జరిగిందని ఓ ప్రకటనలో వెల్లడించాయి. అయితే అది కేవలం యోగక్షేమాలు కనుక్కోవడానికే పరిమితమైందని తెలిపాయి.
కాగా, ఫిలిప్పీన్స్‌లో డ్రగ్స్ మాఫియా అణచివేత పేరుతో జరుగుతున్న మారణహోమాన్ని తీవ్రంగా ఖండించిన ఒబామా.. దీనిపై డ్యుటెర్ట్‌ని నిలదీస్తానని చెప్పిన విషయం తెలిసిందే. అయితే దీనిపై తీవ్రంగా స్పందించిన డ్యుటెర్ట్.. ఒబామాను తీవ్ర పదజాలంతో దూషించారు. దీంతో ఇద్దరి మధ్య మంగళవారం జరగాల్సిన సమావేశాన్ని ఒబామా రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత క్షమాపణలు చెప్పడంతో ఇప్పుడు భేటీ అయ్యారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications