హెచ్1బీ వీసా హోల్డర్లకు బిగ్ రిలీఫ్.. ఆ బిల్లుకు బైడెన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్!!

h1b వీసా దారులకు బిగ్ రిలీఫ్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది బైడెన్ సర్కార్ . వర్క్ ఆథరైజేషన్ బిల్లు ఆమోదానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక బైడెన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో లక్ష మంది h 4 వీసాదారులు, h1b వీసా దారుల భాగస్వాములు, h1b వీసా దారుల పిల్లలకు లబ్ధి జరగనుంది.

గ్రీన్ కార్డ్ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వేలమంది ఇండియన్ టెక్నాలజీ ప్రొఫెషనల్స్ కు బైడెన్ సర్కార్ తీసుకున్న ప్రస్తుత నిర్ణయం లబ్ధిని చేకూరుస్తుంది. గ్రీన్ కార్డ్ పొందకపోతే హెచ్ వన్ బి వీసాదారుల పిల్లలు ఒక నిర్ణీత వయసు తర్వాత అమెరికాను వీడి వెళ్లి పోవాల్సి ఉంటుంది.

Big relief for H1B visa holders.. Biden government green signal for work authorization bill!!

హెచ్ వన్ బి వీసాదారుల మీద ఆధారపడే భాగస్వాములు హెచ్ 4 వీసాదారులు ఉద్యోగం చేయడానికి తప్పనిసరిగా ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ ఐ 765 పొందాల్సి ఉంటుంది. ఇది వచ్చేవరకు వారితో ఇళ్లకే పరిమితం కావలసి వస్తుంది. నైపుణ్యం ఉన్నప్పటికీ పని చేయలేని పరిస్థితి హెచ్ 4 వీసాదారులకు ఉంటుంది. ఇప్పుడు అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం తీసుకున్న ఈ నిర్ణయం వీరందరికీ కాస్త ఊరటనిచ్చింది.

అమెరికాలో వలస వచ్చిన వారికి పర్మినెంట్ రెసిడెన్సీ హక్కులు కల్పించే గ్రీన్ కార్డ్ విషయంలో ఆటోమేటిక్ వర్క్ ఆథరైజేషన్ కల్పించే విధంగా రూపొందించిన బిల్లుకు ఆమోదం తెలుపుతామని బైడెన్ ప్రభుత్వం ప్రకటించడంతో గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న ఇండియన్ టెక్నాలజీ ప్రొఫెషనల్స్ కు పెద్ద ఊరట లభించింది.

బైడెన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వర్క్ ఆథరైజేషన్ బిల్లు కింద ఏటా పద్దెనిమిది వేల మందికి వర్క్ బేస్డ్ గ్రీన్ కార్డును జారీ చేస్తారు. దీంతో ఐదు సంవత్సరాలలో ఒక లక్ష యాభై ఎనిమిది వేల మందికి లబ్ధి కలుగుతుంది. అంతేకాదు ప్రతి సంవత్సరం ఏడాదికి 25 వేల మందికి కే 1, కే 2, కే 3 నాన్ ఇమిగ్రెంట్ గా ఉన్న వారికి లబ్ది జరుగుతుంది.

లక్ష మంది హెచ్ 4 వీసా దారులకు తమ జీవిత భాగస్వామి పనిచేసే ప్రాంతంలో ఉద్యోగం చేసే అవకాశం కూడా లభిస్తుంది. అధికార డెమొక్రాట్ లు, ప్రతిపక్ష రిపబ్లికన్ మధ్య సుదీర్ఘ చర్చ తర్వాత జాతీయ భద్రత ఒప్పందానికి సెనేట్ ఆమోదం లభించింది. అమెరికా కొత్తగా తీసుకు వస్తున్న ఈ బిల్లు అమెరికాను బలోపేతం చేయడంతోపాటు, సరిహద్దులను మరింత సురక్షితం చేస్తుందని యూఎస్ ప్రెసిడెంట్ బైడెన్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+