H1B Visa హోల్డర్లకు బంపర్ ఆఫర్: కోర్టు తీర్పుతో ఖుషీగా టెక్కీలు
భారతీయ టెక్కీలకు ఊరట నిచ్చే తీర్పును యూఎస్ కోర్టు వెలువరించింది. హెచ్ వన్ బి వీసా ఉన్న వారి జీవిత భాగస్వాములు కూడా అమెరికాలో ఉద్యోగం చేయొచ్చని యూఎస్ లోని ఒక కోర్టు సంచలన తీర్పు వెల్లడించడంతో వేలాది మంది భారతీయులలో సంతోషం వ్యక్తం అవుతుంది. అమెరికాలో ఐటీ రంగంలో పనిచేస్తున్న భారతదేశం సహా విదేశీ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ లభించింది.
హెచ్ వన్ బి వీసా హోల్డర్ల భాగస్వాములు అయిన భార్య గానీ, భర్త గానీ అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చని అమెరికాలోని ఓ జిల్లా కోర్టు స్పష్టం చేసింది. గతంలో ఒబామా హయాంలో కొన్ని కేటగిరీల హెచ్ వన్ బి వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగం చేసేందుకు ఎంప్లాయిమెంట్ ఆర్థరైజేషన్ కార్డులను జారీ చేసేలా నిబంధన తీసుకువచ్చారు. అయితే దీనిని రద్దు చేయాలంటూ సేవ్ జాబ్స్ యూఎస్ఏ అనే ఫౌండేషన్ అమెరికాలోని ఓ జిల్లా కోర్టులో పిటిషన్ వేసింది. దీనిని అమెరికా కోర్టు కొట్టేసింది.

హెచ్ వన్ బి వీసాదారుల భాగస్వాములు కూడా ఉద్యోగాలు చేయొచ్చని కోర్టు తన తీర్పులో వెల్లడించింది. ఇక ఈ తాజా తీర్పుతో అమెరికాలో ఉన్న భారతీయ ఉద్యోగులు చాలా రిలీఫ్ ఫీల్ అవుతున్నారు. సేవ్ జాబ్స్ యూఎస్ఏ అనే ఫౌండేషన్ వేసిన ఈ పిటిషన్ పై అమెజాన్, ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ కంపెనీలు కూడా వ్యతిరేకించాయి. ఇక ఇదే సమయంలో హెచ్ వన్ బి వీసాదారుల భాగస్వాములకు అమెరికాలో ఉంటూ ఉద్యోగం చేసుకునేలా అనుమతి ఇవ్వడానికి అమెరికా చట్టసభలు కూడా మొగ్గు చూపుతున్నాయని జడ్జి చుట్కన్ పేర్కొన్నారు.
అమెరికాలో జీవనం ఉంటూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనేక భారతీయ కుటుంబాలకు తాజా కోర్టు తీర్పు లబ్ధి చేకూరుస్తుందని, వేలాది మంది కుటుంబాలకు ఊరటనిస్తుందని ఈ తీర్పు పట్ల ఇమిగ్రెంట్ రైట్స్ అడ్వకేట్ అజయ్ భుటోరియా హర్షం వ్యక్తం చేశారు. ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అయ్యే వారికి ఈ తీర్పుతో మేలు జరుగుతుందని అంటున్నారు.
-
ట్రంప్ డెడ్ లైన్ ముగుస్తున్న వేళ రోడ్లపైకి ఇరాన్ ప్రజలు- ఏం చేస్తున్నారంటే ? -
అమెరికా-ఇరాన్ సీజ్ ఫైర్ మధ్యవర్తి పాక్ కాదా ? అసలు బ్రోకర్ ఎవరంటే ? -
Iran War: సీజ్ ఫైర్ బ్రేక్-మళ్లీ హార్ముజ్ మూసేసిన ఇరాన్..! -
పరగడుపున నిమ్మరసం తేనె తాగుతున్నారా - ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటీ 40 లక్షల మంది ఆత్మత్యాగానికి రెడీ-ట్రంప్ డెడ్ లైన్ వేళ ఇరాన్ అధ్యక్షుడి షాకింగ్..! -
Lockdown: ఇవాళ రాత్రి నుంచే కర్ఫ్యూ, ప్రభుత్వం సంచలన నిర్ణయం! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది..












Click it and Unblock the Notifications