మొత్తానికి ట్రంప్ దిగొచ్చాడు: అర్ధరాత్రి మోదీకి హడావుడిగా ఫోన్ కాల్: అందరికంటే ముందు

ప్రధాని నరేంద్ర మోదీ నేడు తన 75వ పుట్టినరోజు వేడుకలను జరుపుకొంటోన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పలువురు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుల గ్రీటింగ్స్ వెల్లువెత్తాయి. బర్త్ డే నాడు మధ్యప్రదేశ్ లో పర్యటించనున్నారు. ధార్‌లో 'స్వాస్త్ నారీ సశక్త్ పరివార్' క్యాంపెయిన్ ను ప్రారంభిస్తారు.

కాగా- పుట్టినరోజును పురస్కరించుకుని ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. బర్త్ డే విషెస్ తెలియజేశారు. ఈ వివరాలను ట్రంప్.. తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ ద్వారా వెల్లడించారు. మోదీని గ్రేట్ ఫ్రెండ్ గా అభివర్ణించారు. ఆయనతో ఫోన్ లో మాట్లాడానని, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశానని పేర్కొన్నారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించడానికి ఎంతగానో ప్రయత్నిస్తోన్నారని ప్రశంసించారు. నరేంద్రా.. రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించడంలో మీ మద్దతుకు ధన్యవాదాలు.. అని రాశారు.

Birthday Cheers Trump Phone Call to wish PM Modi

దీనికి మోదీ బదులిచ్చారు. తన 75వ జన్మదినం సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి, శుభాకాంక్షలు తెలిపాడని చెప్పారు. నా స్నేహితుడు, అధ్యక్షుడు ట్రంప్‌కు ధన్యవాదాలు. మీలాగే భారత్-అమెరికా సమగ్ర, ప్రపంచ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి నేను పూర్తిగా కట్టుబడి ఉన్నాను. ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం కోసం మీ ప్రయత్నాలకు మద్దతు ఇస్తున్నాను.." అని మోదీ రిప్లై ఇచ్చారు.

ఇష్టానుసారంగా విధిస్తోన్న టారిఫ్ ల నేపథ్యంలో భారత్- అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతినే దశకు చేరుకున్న విషయం తెలిసిందే. రష్యాను బద్ధశత్రువుగా పరిగణిస్తోన్న ట్రంప్.. ఆ దేశంతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న.. దేశాలన్నింటిపైనా కొరడా ఝుళిపిస్తోన్నారు. ఈ క్రమంలో భారత్ పై ఇప్పటికే ఎకాఎకిన 50 శాతం అదనపు టారిఫ్ లను విధించారు.

ఇది తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆ తర్వాత ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. భారత్ సంబంధాలు మరింత బలహీనపడొచ్చని భావిస్తోన్న నేపథ్యంలో ఆయన మెత్తపడ్డారు. ఈ విషయంపై ప్రధాని మోదీతో మాట్లాడతానని, తమ రెండు దేశాల మధ్య దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వాణిజ్య వివాదాల పరిష్కారం కోసం చర్చలు తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించారు. తాను ఎప్పుడూ మోదీకి స్నేహితుడిగానే ఉంటానని, ఆయన గొప్ప ప్రధానమంత్రి అని ప్రశంసించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+