భార్యను వెంటాడి కాల్చి చంపిన పోలీసు(వీడియో)
బ్రెజిలియా: ఓ పోలీసు అధికారి పట్టపగలు తన భార్యను నడిరోడ్డుపై వెంటాడి కాల్చి చంపాడు. ఈ దారుణ ఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. బ్రెజిల్‌కి చెందిన ఓ పోలీసు అధికారి(46) తన భార్య వెరిడియన్ రోడ్రిగస్(36)తో గొడవ పడ్డాడు.
ఈ గొడవ కాస్తా పెద్దది కావడంతో ఆగ్రహంతో తుపాకీ తీసి కాల్చబోయాడు. ఇంతలో భార్య తప్పించుకుని పరిగెత్తుతుండగా వెంటపడి వెనక నుంచి కాల్చి చంపేశాడు. అనంతరం ఇంటికి వెళ్లిపోయి తనను తానే బందించుకున్నాడు.

ఈ ఘటనంతా స్థానిక రోడ్డులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.
సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications