భారత్ కు ఊహించని షాక్ ఇచ్చిన పాక్.. నెక్ట్స్ ఏంటి..?

భారత్ కు మరోసారి పాకిస్థాన్ షాకిచ్చింది. భారత్ కు చెందిన ఎయిర్ లైన్స్, ఎయిర్ క్రాఫ్ట్ లు తమ గగనతలం మీద నుంచి వెళ్లకుండా పాకిస్థాన్ మరోసారి గడువును పెంచింది. ఇదివరకు గడువు నవంబర్ 24 వరకు ఉన్న నేపథ్యంలో ఆ గడువును మరోసారి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 24 వరకు పెంచుతూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల మధ్య విమానాల ప్రయాణానికి గగనతలాలు మూసివేసిన విషయం తెలిసిందే.

భారత్ విషయంలో పాకిస్థాన్ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ కు చెందిన విమానాలు, ఎయిర్ క్రాఫ్ట్ లు పాకిస్థాన్ గగనతలం మీదుగా వెళ్లకుండా ఇదివరకే ఉన్న గడువును తాజాగా మరోసారి పొడిగిస్తూ ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫ్రెష్ నోటీస్ టూ ఎయిర్ మెన్(NOTAM) జారీ చేసింది. గతంలో విధించిన రద్దు నిర్ణయం ఈ నెల 24 వరకు ఉంది. అయితే తాజాగా ఆ గడువును డిసెంబర్ 24 వరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు అక్కడి అధికారులు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వలు నవంబర్ 19 నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులను పాకిస్థాన్ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ జారీ చేసింది.

తాజా నిర్ణయంతో భారత్ నుంచి గుర్తింపు పొందిన అన్ని విమానాలు, లీజుకు తీసుకున్న విమానాలు, మిలిటరీ క్రాఫ్ట్ లు పాకిస్థాన్ గగనతలం గుండా వెళ్లడానికి నిషేధం. గ్రౌండ్ లెవెల్ నుంచి ఎంత ఎత్తు నుంచి అయినా కూడా ప్రయాణం చేయడానికి వీలు లేదని పాకిస్థాన్ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ స్పష్టం చేసింది.

Breaking Pakistan Extends Ban on Indian Flights Till Dec 24 Again

ఇక జమ్మూకాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ లో ఏప్రిల్ 22న జరిగిన మారణహోమంలో ఉగ్రమూకలు జరిపిన కాల్పుల్లో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ పై భారత్.. ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక స్థావరాలపై దాడులు జరిపింది. వాటిని ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో వందల మంది ఉగ్రమూకలు హతం అయినట్లు డిఫెన్స్ మినిస్ట్రీ వెల్లడించింది. ఈ క్రమంలో భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+