మోస్ట్ పవర్ ఫుల్ అమెరికన్ పాస్‌పోర్ట్ లో భారీ మార్పులు
పాస్ పోర్టులో సవరణలు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న విధానపరమైన నిర్ణయాలకు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆమోదం తెలిపింది. లింగమార్పిడి, నాన్ బైనరీ, ట్రాన్స్ జెండర్లు తమ సెక్స్ ఐడెంటిటీకి అనుగుణంగా పాస్‌పోర్ట్ లో ఉన్న ఆప్షన్లను ఎంచుకునే విధానంపై ఆంక్షలు విధించడానికి వీలు కల్పించింది. ఈ మేరకు అమెరికా సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ఇచ్చింది. ఎమర్జెన్సీ పిటీషన్ కింద దీన్ని విచారించిన అనంతరం తీర్పు వినిపించింది.
వాస్తవానికి- పాస్ పోర్టు దరఖాస్తులో జెండర్ ఐడెంటిటీని తెలియజేయడానికి పురుషుడు, స్త్రీ లేదా థర్డ్ జెండర్ అనే ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో లింగమార్పిడి, నాన్ బైనరీ, ట్రాన్స్ జెండర్లు తమ ఐడెంటిటీని తెలియజేసే ఆప్షన్ ఇప్పటివరకు లేదు. ఈ కాలమ్ లో ఎక్స్ అని టిక్ చేస్తే సరిపోతుంది. దీనివల్ల థర్డ్ జెండర్ కేటగిరీలోకి వచ్చిన వాళ్లు లింగమార్పిడి చేయించుకున్న వాళ్లు, నాన్ బైనరీ, ట్రాన్స్ జెండర్లు అనేది గోప్యంగానే ఉంటూ వస్తోంది.

దీన్ని సవరించింది డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. థర్డ్ జెండర్ కాలమ్ లో ఎక్స్ అని మార్క్ చేయడాన్ని రద్దు చేసింది. దరఖాస్తుదారులు తమ జెండర్ ఐడెంటిటీని ఖచ్చితంగా తెలియజేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీనిపై అమెరికా సుప్రీంకోర్టులో పలు పిటీషన్లు దాఖలయ్యాయి. ఎల్జీబీటీక్యూ అసోసియేషన్లు దీన్ని దాఖలు చేశాయి. ఈ సవరణలను రద్దు చేయాలని అభ్యర్థించాయి. దీనివల్ల జెండర్ ఐడెంటిటీ తలెత్తుతుందని, అది అసమానతలకు దారి తీస్తుందని అభ్యంతరం వ్యక్తం చేశాయి.
దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కు అనుకూలంగా తీర్పు వినిపించింది. హోల్డర్లు తమ జెండర్ ఐడెంటిటీని తెలియజేయడం వల్ల సమానత్వ సూత్రాలకు ఎటువంటి విఘాతం కలగదని తేల్చి చెప్పింది. ఇలా తెలియజేయడం వల్ల తమ దేశాన్ని గౌరవించినట్టవుతుందని పేర్కొంది. ప్రభుత్వం వాస్తవ వివరాలను తెలియజేయాలని కోరిందే తప్ప ఇందులో ఎవరినీ వివక్షకు గురిచేయట్లేదని అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications