బ్రెగ్జిట్ ఫలితాలు: కోరి కష్టాల్లోకి బ్రిటన్, ప్రభావం ఎంత మేరకు?
లండన్: గత నాలుగు దశాబ్దాలుగా ఐరోయా యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో కలిసి ఉన్న బ్రిటన్ 'బ్రెగ్జిట్' తో కోరి కష్టాలను కొని తెచ్చుకుందా అంటే అవుననే అంటున్నారు. శుక్రవారం వెల్లడైన ఫలితాల్లో ఈయూ నుంచి వైదొలగడాన్ని 52 శాతం మంది ప్రజలు సమర్ధించిన సంగతి తెలిసిందే.
కాగా, రాబోయే రోజుల్లో బ్రిటన్ ఎదుర్కొనే ఆర్ధిక కష్టాలు... ఈయూ నుంచి వైదొలగినంత సులువు కాదంటున్నారు. ఇప్పటి వరకు యూరోపియన్ యూనియన్‌లో ఉన్న బ్రటిన్ చాలా ఆటుపోట్లను ఎదుర్కొవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈయూ నుంచి వైదొలగడం వల్ల బ్రిటన్‌లో అల్లకల్లోం జరిగే అవకాశం ఉంది.
Damon Albarn first Glastonbury star to mention EU result. "Democracy failed us because it was ill-informed." pic.twitter.com/4tnok61MUH
— Kaya Burgess (@kayaburgess) June 24, 2016
బ్రెగ్జిట్ ఆ దేశంలో వేర్పాటు వాదాన్ని తలెత్తేలా చేస్తుందోమోనని అంటున్నారు. బ్రెగ్జిట్‌పై రిఫరెండం కోసం బ్రిటన్ వాసులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఇందులో ఒక వర్గం ప్రజలు బ్రెగ్జిట్‌కు మద్దతు తెలపగా, మరో వర్గం వారు వ్యతిరేకించారు. తాజా బ్రిటన్ నిర్ణయంతో బ్రిటన్ వ్యాపార, వాణిజ్య రంగాల్లో ప్రధానంగా మార్పులు చోటు చేసుకోనున్నాయి.
Will these two men be running the country before long? pic.twitter.com/xlBiQl0V0R
— Steven Swinford (@Steven_Swinford) June 24, 2016
బ్రిటన్‌లో ఉద్యోగాలు తగ్గడం, ధరలు విపరీతంగా పెరగడం లాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. బ్రెగ్జిట్ నుంచి వైదొలగాలని ప్రజలు నిర్ణయించడంతో గతంలో ఎన్నడూ లేనంత విధంగా బ్రిటన్ పౌండ్ విలువ 11 శాతానికి పడిపోయింది. దీని వల్ల ఆ దేశ దిగుమతుల భారం పెరుగుతుంది.
తాజా నిర్ణయం వల్ల గతంలో యూరోపియన్ యూనియన్ ప్రయోజనాలు కూడా బ్రిటన్‌కు దూరం అవుతాయి. బ్రిటన్ సంస్ధలు యూనియన్‌లోని మిగతా 27 దేశాల్లో స్వేచ్ఛగా వాణిజ్యాన్ని నిర్వర్తించలేవు. నిజానికి బ్రిటన్ ఎగుమతులు సగం వరకు ఈయూ దేశాలకు వెళుతున్న సంగతి తెలిసిందే.
ఈ పరిమాణం బ్రిటన్‌కు పెద్ద దెబ్బ. గతంలో మాదిరి ప్రోత్సహకాలు ఉండకపోగా రాబోయే రోజుల్లో బ్రిటన్ పన్నులు కూడా చెల్లించాల్సి రావొచ్చు. బ్రెగ్జిట్ వల్ల ఐరోపా యూనియన్‌లోని దేశాలతో పాటు ప్రపంచంలోని మిగతా దేశాలతో పాటు బ్రిటన్ కొత్తగా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవాల్సి వస్తుంది.
Our new Prime Minister is greeted warmly. pic.twitter.com/SrHd25uy7B
— SimonNRicketts (@SimonNRicketts) June 24, 2016
ఇదంతా జరగడానికి చాలా సమయం పడుతుంది. మరోవైపు ఈయూ ఆర్ధిక వ్యవస్ధలో 80 శాతం వాటా సేవల రంగానిదే. అందులోనూ 40 శాతం వాటా బ్రిటన్‌దే. ఒక్క లండన్‌లోనే లక్షకు పైగా సంస్ధలు ఈయూ వ్యాప్తంగా సేవలు అందిస్తున్నాయి. బ్రిటన్ తాజా నిర్ణయంతో ఈ సంస్ధలు ఐరోపా కూటమిలోని ప్రయోజనాలను పొందేందుకు గాను ఫ్రాంక్ ఫర్డ్, పారిస్‌కు వెళ్లే అవకాశం కూడా ఉంది.
ఈ పరిణామాలన్నీ కూడా బ్రిటన్ ఆర్ధిక వ్యవస్ధను తీవ్రంగా దెబ్బతీసే ఆవకాశం ఉంది. బ్రెగ్జిట్ నిర్ణయం మాంద్యం దిశగా సాగితే ప్రపంచ వృద్ధికి తీవ్ర విఘాతం కలుగుతుంది. దీనిని ముందుగానే ఊహించాయి కాబట్టే ఇంగ్లాండ్ సెంట్రల్ బ్యాంక్ సహా బ్రిటన్ లోని ఇతర బ్యాంకులన్నీ బ్రగ్జిట్ ను తీవ్రంగా వ్యతిరేకించాయి. కానీ ప్రజలు మాత్రం బ్రెగ్జిట్‌కే మద్దతు తెలపడం విశేషం.
-
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!!












Click it and Unblock the Notifications