వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అట్టహాసంగా బ్రిక్స్: మోడీతో జిన్‌పింగ్ కరచాలనం.. స్వయంగా ఆహ్వానం!

ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం చైనాలోని జియామెన్ నగరంలో బ్రిక్స్ సదస్సు అట్టహాసంగా ప్రారంభమైంది.

|
Google Oneindia TeluguNews

బీజింగ్: డోక్లాం వివాదం నేపథ్యంలో బ్రిక్స్ తొమ్మిదో శిఖరాగ్ర సదస్సును ప్రపంచ దేశాలన్ని ఆసక్తిగా గమనిస్తున్నాయి. అంతర్జాతీయ వేదికపై చైనా-భారత్ పరస్పర ఆరోపణలకు దిగుతాయా? లేక మైత్రిపూర్వక వాతావరణంలోనే సదస్సును ముగిస్తాయా? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం చైనాలోని జియామెన్ నగరంలో బ్రిక్స్ సదస్సు అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా బ్రిక్స్ దేశాల అధినేతలంతా గ్రూప్ ఫోటో దిగారు. రెడ్ కార్పెట్ పై ప్రధాని మోడీ సహా బ్రెజిల్, రష్యా, దక్షిణాఫ్రికా దేశాధినేతలను స్వయంగా ఆహ్వానించిన జిన్ పింగ్.. మోడీతో కరచాలనం చేశారు.

 BRICS summit kicks off; Xi, Modi display bonhomie

తొలుత చైనా అధ్యక్షుడు వేదిక వద్దకు చేరుకోగా.. ఆ తర్వాత మరో దేశాధ్యక్షుడు వచ్చారు. మూడో నేతగా ప్రధాని మోడీ, ఆయన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ సదస్సు వేదిక వద్దకు వచ్చారు. మంగళవారం నాడు ప్రధాని మోడీ జిన్ పింగ్ తో భేటీ అయి భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు.

కాగా, సదస్సు ఆసాంతం శాంతియుతంగా చర్చలు జరగాలని బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలు ఆకాంక్షిస్తున్నాయి. స్నేహపూర్వకంగా వివాదాలను పరిష్కరించుకోవాలని భావిస్తున్నాయి.'మెరుగైన భవిష్యత్తుకు బలమైన భాగస్వామ్యం' అన్న కాన్సెప్టుతో ఈ దఫా సదస్సును నిర్వహిస్తున్నారు.

English summary
The BRICS summit began here on Monday with a group photograph of leaders of the five countries and was preceded by a warm handshake between Prime Minister Narendra Modi and Chinese President Xi Jinping, who received the leaders of Brazil, Russia and South Africa ahead of the restricted meeting of the grouping.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X