కిమ్‌కు మరో షాక్: ఉ.కొరియాపై యుద్ధానికి బ్రిటన్ సిద్ధం, రంగంలోకి ‘క్వీన్ ఎలిజబెత్’
లండన్: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే అమెరికా, జపాన్, దక్షిణ కొరియాలు ఉత్తర కొరియాపై యుద్ధానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉత్తరకొరియాతో యుద్ధంలోకి దిగేందుకు బ్రిటన్ సమాయత్తమైనట్లు రిపోర్టులు వస్తున్నాయి.
అమెరికా, ఉత్తరకొరియాల మధ్య యుద్ధ వాతావారణం రోజు రోజుకూ వేడెక్కుతున్న నేపథ్యంలో బ్రిటన్ కూడా యుద్ధానికి ఆయుధ సామగ్రిని సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం బ్రిటన్ తన సరికొత్త విమాన వాహక నౌక హెచ్ఎంఎస్ క్వీన్ ఎలిజబెత్‌ను రంగంలోకి దించుతున్నట్లు సమాచారం.

తమ వద్ద టైప్-45 డెస్ట్రాయర్లు, టైప్-23 ఫ్రిగేట్స్ ఉన్నా.. అత్యవసరమైతే క్వీన్ ఎలిజబెత్‌ను కూడా రంగంలోకి దించుతామని మిలటరీ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఏడాది ఆఖర్లో క్వీన్ ఎలిజబెత్‌ను నేవీకి అప్పగించనున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్‌లు మాటల యుద్ధానికి తెర దించకపోతుండటమే బ్రిటన్ యుద్ధానికి సిద్ధం కావడానికి కారణమని చెప్పారు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ!












Click it and Unblock the Notifications