వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'తొలి మహిళా సూసైడ్ బాంబర్ కావాలని ఉంది'

|
Google Oneindia TeluguNews

లండన్: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) తొలి మహిళా సూసైడ్ బాంబర్ కావాలని ఉందని బ్రిటన్ కు చెందిన ఓ మహిళ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నది. అమెరికా సైనిక దళాలు నా లక్ష్యం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ రెచ్చిపోతున్నది.

బ్రిటన్ కు చెందిన సాలీ జోన్స్ (46) గతంలో సిరియా పారిపోయి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిని వివాహం చేసుకుంది. తరువాత అమెరికా జరిపిన వైమానిక దాడులలో అనేక మంది ఉగ్రవాదులతో పాటు సాలీ జోన్స్ భర్త మరణించాడు.

అప్పటి నుంచి తాను ఇస్లామిక్ స్టేట్ తొలి మహిళా సూసైడ్ బాంబర్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించే సాలీ జోన్స్ పదే పదే అమెరికాను ఈ రకంగా హెచ్చరిస్తూ పోస్ట్ చేస్తుంటుంది.

British Women hints she will become Islamic State first female suicide bomber

సాలీ జోన్స్ వలన భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన చెందిన అమెరికా భద్రతా దళాలు ఈ మహిళా ఉగ్రవాది కోసం గాలిస్తున్నాయి. ఎలాగైనా సాలీ జోన్స్ ను గుర్తించాలని వేట ప్రారంభించారు.

డ్రోన్ లు ఉపయోగించి సాలీ జోన్స్ ను అంతం చెయ్యాలని అమెరికా బలగాలు భావిస్తున్నాయి. 2000లో చెచెన్యాలో హవా బరయెవ్ రష్యా దళాలపై ఆత్మాహుతి దాడికి పాల్పడింది. సాలీ జోన్స్ నిత్యం హవాను ప్రశంసిస్తుంటుందని బ్రిటీష్ మీడియా వెల్లడించింది. బ్రిటీష్ మీడియా ఈమెను మిసెస్ టెర్రర్ అనే పేరుతో పిలుస్తుంటుంది.

English summary
A 46-year-old British woman who fled to Syria to marry an Islamic State fighter has indicated that she intends to become the terror group's first female suicide bomber.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X