ఒంటరిగా ఉండటమే ఇష్టమంటున్న పాప్ సింగర్
న్యూఢిల్లీ: హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ తాను ఒంటరిగా ఉండటాన్ని ఆస్వాదిస్తున్నానని తెలిపారు. ఇటీవల తన ప్రియుడు డేవిడ్ లూకాడోతో ప్రేమను తెగతెంపులు చేసుకుంది.
ఈ సందర్బంలో బ్రిట్నీ స్పియర్స్ మాట్లాడుతూ ఓ ప్రైవేటు ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది. విడిపోయిన తర్వాత తాను ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. స్విమ్మింగ్ అంటే ఇష్టమని, ఎల్లప్పుడూ స్విమ్మంగ్ చేస్తానని, స్పాలకు వెళ్లడం కూడా చాలా ఇష్టమని.. అప్పుడప్పుడు వంట కూడా చేస్తానని తెలిపింది.

డ్యాన్సర్ కెవిన్ ఫెడర్లిన్‌తో కలిసి సంసారం చేసినప్పుడు బ్రిట్నీ స్పియర్స్ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. సీన్ ఫ్రెస్టన్ వయసు 8 సంవత్సరాలు కాగా.. జేడన్ జేమ్స్ వయసు 7 సంవత్సరాలు. ప్రస్తుతం వారిద్దరితో కలిసి చదువుకుంటూ, ఎక్కువ సమయాన్ని గడుపుతున్నానని ఆమె అన్నారు. ఇలా మనకంటూ ఓ గోల్ ఏర్పరచుకుని దానిని సాధించే క్రమంలో ముందుకెళ్లాలని సూచించింది.
బ్రిట్నీ స్పియర్స్ తన మాజీ ఏజెంట్ జాసన్ ట్రావిక్‌తో కొన్నాళ్లు సహజీవనం చేసింది. అతన్నితో పెళ్లికి కూడా సిద్ధమైంది. ఏమైందో ఏమో కానీ అది ఆచరణకు నోచుకోలేదు. 32 సంవత్సరాల వయసు కలిగిన బ్రిట్ని స్పియర్స్ అంతకు ముందు తన చిన్ననాటి స్నేహితుడు జాసన్ అలెగ్జాండర్‌ని చేసుకోగా.. ఆ తర్వాత డ్యాన్సర్ కెవిన్ ఫెడర్లిన్‌ను వివాహం చేసుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వీరిద్దరి నుండి స్పియర్స్ విడిపోయారు.












Click it and Unblock the Notifications