వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రస్సెల్స్ బాంబు పేలుళ్లకు పాల్పడింది వీరే: ఎవరీ అబ్దెస్లాం?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

బెల్జియం: యూరప్‌లో జరుగుతున్న ఉగ్రదాడులకు సలాహ్ అబ్దెస్లాం ఇప్పుడు కేంద్రబిందువుగా మారాడు. బెల్జియంలో జన్మించిన ఈ ఫ్రెంచ్ జాతీయుడు గత నవంబర్‌లో జరిగిన పారిస్ నరమేధానికి కీలక సూత్రధారిగా పారిస్ పోలీసులు భావిస్తున్నారు. ఆ దాడులకు ఇతడే ఉగ్ర సామాగ్రిని సమకూర్చాడని భద్రతాదికారులు భావిస్తున్నారు.

అంతేకాదు పారిస్‌లో ఉగ్రదాడి జరిగినప్పుడు అతడు పారిస్‌లోనే ఉన్నాడు. ఓవైపు తన అనుచరులు విచ్చలవిడిగా మారణహోమం సృష్టిస్తుంటే పోలీసులు కన్నుగప్పి బెల్జియంకు పారిపోయాడు. పారిస్ దాడుల్లో ఇతని తమ్ముడు బ్రహీం తనను తాను పేల్చేసుకుని మరణించాడు.

బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో బ్రహీంతో కలిసి మోలెన్‌బీక్ అనే శరణార్ధుల బస్తీలో ఇతడు బార్ నడిపేవాడు. పారిస్ దాడులకు కొద్దిరోజుల ముందే ఆ బార్‌ను పోలీసులు మూసేశారు. రకరకాల శరణార్ధులతో నిత్యం కిక్కిరిసి ఉండే ఈ మరికివాడలో ఉగ్రవాదం ఊపిరి పోసుకుంటుంది.

ఇదిలా ఉంటే బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌ విమానాశ్రయంలో దాడులకు పాల్పడిన వారిలో ఇద్దరు సోదరులు ఉన్నారని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ నిందితుల పేర్లను బెల్జియం మీడియా సంస్థ బుధవారం ప్రకటించింది.

ఖలీద్‌, బ్రహిమ్‌ ఇల్‌ బక్రోయి అనే ఇద్దరు సోదరులు బ్రస్సెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారని, వీరితో పాటు ఉన్న మూడో వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని మీడియా తెలిపింది.

ఈ ఉగ్రదాడికి పాల్పడింది తామేనంటూ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ ప్రకటించింది. బాంబు పేలుళ్ల ఘటన అనంతరం బ్రెస్సెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు.

బ్రస్సెల్స్ బాంబు పేలుళ్లు: ఎవరీ అబ్దెస్లాం?

బ్రస్సెల్స్ బాంబు పేలుళ్లు: ఎవరీ అబ్దెస్లాం?

ఆ మురికివాడలో సరదాగా బార్ నడిపే ఈ మొరాకో సంతతి సోదరులు ఇంతటి ఘాతుకాలకు ఒడిగట్టారంటే స్థానికులు నమ్మలేకపోతున్నారు. 2009-2011 మధ్యకాలంలో సలాహ్ అబ్దెస్లాం బెల్జియం ప్రభుత్వ రైల్వేలో మెకానిక్‌గా పనిచేశాడు.

బ్రస్సెల్స్ బాంబు పేలుళ్లు: ఎవరీ అబ్దెస్లాం?

బ్రస్సెల్స్ బాంబు పేలుళ్లు: ఎవరీ అబ్దెస్లాం?


2015 ఆగస్టులో సలాహ్ అబ్దెస్లాం మరో అనుమానిత ఉగ్రవాదితో కలిసి ఇటలీ నుంచి ఫెర్రీలో గ్రీసు బయర్దేరి వెళ్లాడు. 'సాధారణ పౌరుల తరహాలోనే వారు వెళ్లారు. పోలీసులు వేటాడుతున్న ఉగ్రవాదుల్లా కాదు' అని ఇటలీ అంతరంగిక భద్రతామంత్రి ఏంజెలినో అల్ఫానో అన్నారు.

బ్రస్సెల్స్ బాంబు పేలుళ్లు: ఎవరీ అబ్దెస్లాం?

బ్రస్సెల్స్ బాంబు పేలుళ్లు: ఎవరీ అబ్దెస్లాం?

సెప్టెంబర్‌లో ఇటలీ అంతా కలియతిరుగుతూ బెల్జియం చేరుకున్నారు. అద్దెకారులో మరో ఇద్దరితో కలిసి వెళుతుండగా ఆస్ట్రియా సరిహద్దులో పోలీసులు ఆపారు. బెల్జియన్ ఐడీ కార్డులు చూపితే వదిలేశారు. ఆ తర్వాత ఆ కార్డులు నకిలీవని తేలిందని బెల్జియన్ ఫెడరల్ ప్రాసిక్యూటర్ తెలిపారు.
బ్రస్సెల్స్ బాంబు పేలుళ్లు: ఎవరీ అబ్దెస్లాం?

బ్రస్సెల్స్ బాంబు పేలుళ్లు: ఎవరీ అబ్దెస్లాం?


అక్టోబర్‌లో పారిస్ సమీపంలోని టపాకాయల దుకాణంలో సలాహ్ అబ్దెస్లాం డిటనేటర్లు కొన్నట్టు తెలిసింది. నవంబర్ దాడులకు ఉపయోగించిన ఫోక్స వ్యాగన్ పోలో కారును బ్రస్సెల్స్ శివారులోని ఎట్టర్ బీక్‌లో గల ఆస్ట్రల్ రెంట్ కార్ అనే కంపెనీలో అద్దెకు తీసుకున్నాడు.

బ్రస్సెల్స్ బాంబు పేలుళ్లు: ఎవరీ అబ్దెస్లాం?

బ్రస్సెల్స్ బాంబు పేలుళ్లు: ఎవరీ అబ్దెస్లాం?


పారిస్‌కు ఉత్తరంగా ఓయిస్ అనే చోట రెనాల్ట్ క్లియో కారులో పెట్రోల్ పోయించుకుంటూ సెక్యూరిటీ కెమెరాకు చిక్కాడు. నిజానికి దాడుల కోసం అద్దెకు తీసుకున్న ఒక కారులో ఉగ్రవాదులను స్టేడ్-డి-ఫ్రాన్స్ వద్దకు చేర్చింది కూడా సలాహ్ అబ్దెస్లాం.

 బ్రస్సెల్స్ బాంబు పేలుళ్లు: ఎవరీ అబ్దెస్లాం?

బ్రస్సెల్స్ బాంబు పేలుళ్లు: ఎవరీ అబ్దెస్లాం?

అక్కడ తాను ఆత్మాహుతి దాడిలో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ చివరి నిమిషంలో వెనుకంజ వేశాడు. అతడు తనను తాను పేల్చుకునేందుకు తెచ్చుకున్న బాంబులను పారిస్‌లోని ఓ రోడ్డు పక్కనే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 బ్రస్సెల్స్ బాంబు పేలుళ్లు: ఎవరీ అబ్దెస్లాం?

బ్రస్సెల్స్ బాంబు పేలుళ్లు: ఎవరీ అబ్దెస్లాం?


ఆ తర్వాత పారిస్ దాడుల అనంతరం అతడు బ్రస్సెల్స్‌కు పారిపోయాడు. బ్రస్సెల్స్ చేరుకున్న అతడు పోలీసులకు దొరకకుండా ఉండేందుకు కనీసం మూడు వారాలపాటు ఓ ప్లాట్‌లో దాక్కున్నాడు. గత శుక్రవారమే మోలెన్ బీక్‌లోనే బెల్జియం పోలీసులు జరిపిన ఆపరేషన్‌లో పట్టుబడ్డాడు.

 బ్రస్సెల్స్ బాంబు పేలుళ్లు: ఎవరీ అబ్దెస్లాం?

బ్రస్సెల్స్ బాంబు పేలుళ్లు: ఎవరీ అబ్దెస్లాం?


ఈ ఆపరేషన్‌లో గాయపడ్డ సలాహ్ అబ్దెస్లాంకు ఆసుపత్రిలో చికిత్స జరిపించిన పోలీసులు ప్రస్తుతం అతడిని ప్రశ్నించారు. అంతక ముందు మూడు రోజుల క్రితం ఒక అపార్ట్‌మెంట్ దగ్గర జరిపిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. నలుగురు పోలీసులు కూడా గాయపడ్డారు.

 బ్రస్సెల్స్ బాంబు పేలుళ్లు: ఎవరీ అబ్దెస్లాం?

బ్రస్సెల్స్ బాంబు పేలుళ్లు: ఎవరీ అబ్దెస్లాం?


అయితే ఈ కాల్పులు జరుగుతున్న సమయంలో సలాహ్ అబ్దెస్లాం అక్కడి నుంచి తప్పించుకున్నాడని అంటున్నారు. ఇది జరిగిన మూడు రోజులకే బ్రస్సెల్స్‌లో ఉగ్రదాడి జరిగింది. మంగళవారం ఉదయం జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 34 మంది చనిపోగా వంద మందికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది.

English summary
Revenge strike? Evidence of a tragic combination of a new cell and incompetent security services? A last effort by the battered network of Salah Abdeslam, the logistician for last year’s Paris attacks who was arrested in Brussels on Friday? Or – given that we still have very few details of Tuesday morning’s events none of the above?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X