వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గర్భిణీ మహిళలు జాగ్రత్త: టీ, కాఫీలు తీసుకుంటే ఏమవుతుందో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

కాఫీ, టీలు అధికంగా తీసుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుందన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ కాఫీలు టీలలో ఉండే కెఫైన్ అనే పదార్థం గర్భిణ స్త్రీలకు మరింత ప్రమాదం అని కొత్త పరిశోధనల ద్వారా వెల్లడైంది. ఈ పరిశోధనలను అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్స్‌టెట్రీషియన్స్ మరియు గైనకాలజిస్టులు చేసి కొన్ని కొత్త విషయాలు చెప్పారు.

 కెఫైన్ ఎక్కువగా తీసుకుంటే కడుపులో బిడ్డపై ప్రభావం

కెఫైన్ ఎక్కువగా తీసుకుంటే కడుపులో బిడ్డపై ప్రభావం

సాధారణంగా 200 మిల్లీగ్రాముల కెఫైన్ తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. కానీ గర్భిణీ స్త్రీలు దీనికంటే తక్కువగా తీసుకున్న కడుపులోని బిడ్డకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందట. అంటే బిడ్డ తక్కువ బరువుతో పుట్టడంగానీ, నెలలు నిండకుముందే పుట్టడంలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ప్రణాళిక ప్రకారం మహిళలు గర్భం దాల్చరని లేదంటే పిల్లలు కనాలనుకునే వారు టీ, కాఫీలు ఎంత తగ్గిస్తే అంత మంచిదని సూచిస్తున్నారు. తాము చేసిన పరిశోధనల్లో గర్భిణీ స్త్రీలు కాఫీ, టీలు తీసుకోవడం వల్ల అందులోని కెఫైన్ పదార్థం కడుపులోని పిండంపై పై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు గమనించామని పరిశోధకులు చెప్పారు. అందులో ఎక్కువ కేసులు కాఫీ తాగుతున్న గర్భిణీ స్త్రీలల్లోనే కనుగొన్నట్లు చెన్ అనే వైద్యుడు తెలిపారు.

కెఫైన్ తీసుకున్న గర్భిణీల్లో బిడ్డ బరువు 175 గ్రాములు తగ్గిందట

కెఫైన్ తీసుకున్న గర్భిణీల్లో బిడ్డ బరువు 175 గ్రాములు తగ్గిందట

ఐర్లాండ్‌లో పిల్లలకు జన్మనిచ్చిన 941 తల్లులను పరిశీలించినట్లు చెప్పారు చెన్. ఇందులో సగానికి పైగా టీ తీసుకుంటున్న తల్లులు ఉంటే... 40 శాతం మంది కాఫీ తీసుకుంటున్నారు. ప్రతి మూడు నెలలకు బిడ్డ పరిస్థితిని గమనిస్తే సాధారణ స్థాయికంటే 100 మిల్లీ గ్రాముల కెఫైన్ తీసుకుంటున్న గర్భిణీల్లో బిడ్డ 72 గ్రాములు బరువు తగ్గుతూ వస్తున్నట్లు తాము అబ్జర్వ్ చేసినట్లు చెన్ చెప్పారు. అంతేకాదు బిడ్డ అవయవాలు కూడా కొంత తేడాగా కనిపించినట్లు చెప్పారు. కెఫైన్ ఎక్కువగా తీసుకున్న గర్భిణీ స్త్రీలల్లో బిడ్డ బరువు 170 గ్రాములు తగ్గుదల చూపిస్తుండగా అదే కెఫైన్‌కు దూరంగా ఉన్న గర్భిణీ స్త్రీలల్లో బిడ్డ బరువు బాగుందని తమ పరిశోధనల్లో వెల్లడైనట్లు చెప్పారు చెన్.

 కెఫైన్ ఎక్కువగా తీసుకుంటే రక్తప్రసరణ తగ్గిపోతుంది

కెఫైన్ ఎక్కువగా తీసుకుంటే రక్తప్రసరణ తగ్గిపోతుంది

ఎక్కువగా కెఫెన్ తీసుకుంటే రక్తప్రసరణ తగ్గిపోయే అవకాశం ఉంటుందని దీంతో ఆ ప్రభావం పిండంపై పడుతుందని చెన్ వివరించారు. 355 మిల్లీలీటర్ల బ్రూడ్ కాఫీలో 200 మిల్లీ గ్రాముల కెఫైన్ ఉంటుంది. అదే టీలో ఇది కాస్త తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు లిప్టన్ టీ కంపెనీ నుంచి తయారయ్యే టీ పొడిలో ఇదే 355 మిల్లీలీటర్ల టీలో 83 మిల్లీగ్రాముల కెఫైన్ ఉంటుందని ఆ కంపెనీ చెబుతోంది. మరోవైపు కెఫైన్ కల్గి ఉన్న టీ కాఫీలను గర్భిణీ స్త్రీలు ఎంత తగ్గిస్తే అంత మంచిదని పరిశోధకులు చెబుతున్నారు.

English summary
Pregnant women who consume caffeine - whether it’s from coffee or tea - have smaller babies than those who abstain from the stimulant during pregnancy, new research suggests Even women who took in less than 200 milligrams of caffeine, the safe cutoff during pregnancy according to the American College of Obstetricians and Gynecologists (ACOG), had a significantly increased risk of delivering prematurely or having a low-birthweight baby.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X