ఇదే నా నెంబర్, ఫోన్ చేయండి: మరోసారి చిక్కుల్లో ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. అదేమంటే ప్రపంచ దేశాధినేతలకు ఆయన తన వ్యక్తిగత సెల్ ఫోన్ నెంబర్ ఇచ్చి సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. అదేమంటే ప్రపంచ దేశాధినేతలకు ఆయన తన వ్యక్తిగత సెల్ ఫోన్ నెంబర్ ఇచ్చి సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. కాగా, ప్రొటోకాల్ ను పక్కన పెట్టి నేరుగా ట్రంప్ నకు ఫోన్లు రావడం మంచిది కాదని భద్రతా అధికారులు భావిస్తున్నారు.

కెనడా, మెక్సికో, ఫ్రాన్స్ అధ్యక్షులకు ట్రంప్ తన వ్యక్తిగత ఫోన్ నెంబరు ఇచ్చారు. అంతేగాక, ఎప్పుడైనా తనకు ఫోన్ చెయ్యవచ్చని, నేరుగా తనతో మాట్లాడమంటూ వారికి చెప్పారు. ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఇమ్మానుయేల్ మాక్రాన్ ఎన్నిక సమయంలో కూడా ట్రంప్ నేరుగా ఆయనకు ఫోన్ చేసి తన సొంత నెంబర్ ఇచ్చారు.

 Call me on my mobile, says Donald Trump, in new breach of protocol

అయితే, ఇప్పుడు పర్సనల్ నెంబర్ ఇవ్వడం ప్రమాదకరమని భద్రతా నిపుణులు పేర్కొంటున్నారు. ఎటువంటి భద్రతా చర్యలు లేకుండా నేరుగా అధ్యక్షుడు ట్రంప్ నకు ఫోన్ చేసి మాట్లాడితే ఆయన ఫోన్ ను గూఢచారులు హ్యాక్ చేసే ప్రమాదముందని అంటున్నారని తెలిపారు.

దేశ భద్రతకు సంబంధించిన కీలక విషయాలను ఫోన్ లో సంభాషించినప్పుడు అవి బయటికి పొక్కే ప్రమాదం ఉందని, అంతేగాక, ట్రంప్ ఎలాంటి సెక్యూరిటీ ఫీచర్లు లేని సాదాసీదా ఫోన్ వాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+