Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

H1B Visa: హెచ్1బీ వీసాదారులకు కెనడా గుడ్ న్యూస్..!

ప్రవంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో నిపుణుల కొరత వేధిస్తోంది. దీంతో నిపుణులు ఏ దేశంలో ఉన్నా వారిని నెత్తిన పెట్టుకునేందుకు దేశాలు సిద్ధమవుతున్నాయి. కానీ అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికాలో మాత్రం పరిస్ధితులు భిన్నంగా ఉన్నాయి. అమెరికన్లకు ఉద్యోగాలు రావడం లేదనే సాకుతో ప్రపంచస్ధాయి కంపెనీల్లో సైతం స్ధానికులకే ప్రాధాన్యం ఇవ్వాలంటూ ట్రంప్ సర్కార్ ఒత్తిడి చేస్తోంది. వారు అంగీకరించకపోవడంతో హెచ్1బీ వీసా ఛార్జీల్ని అమాంతం ఏటా లక్ష డాలర్లకు పెంచేశారు. దీంతో అమెరికాకు వెళ్లాలనుకునే నిపుణులతో పాటు వారికి ఉద్యోగాలిస్తున్న కంపెనీలు ఆలోచనలో పడ్డాయి.

ఈ నేపథ్యంలో అమెరికా హెచ్1బీ వీసాదారుల్ని తమవైపు తిప్పుకునేందుకు వివిధ దేశాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇందులో భాగంగా పొరుగునే ఉన్న కెనడా హెచ్1బీ వీసా దారులకు ఇమ్మిగ్రేషన్ నిబంధనల్ని సడలించి తమ దేశానికి ఆహ్వానిస్తోంది. తమ దేశానికి వచ్చే హెచ్1బీ వీసాదారులకు వేగంగా ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేస్తోంది. ఇది అమెరికాలో ఇబ్బందులు పడుతున్న భారతీయులకు భారీ ఊరట కలిగించే అంశంగా భావిస్తున్నారు.

Canada opens doors to US H-1B talent amid steep American visa fee row

కెనడా ప్రభుత్వం అమెరికన్ హెచ్1బీ వీసాదారుల కోసం ప్రత్యేకంగా వేగవంతమైన ఇమ్మిగ్రేషన్ మార్గాన్ని ప్రారంభిస్తోంది. ఇది అధిక నైపుణ్యం కలిగిన ప్రతిభను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాలలో తాజాగా చోటు చేసుకుంటున్న మార్పుల్ని సొమ్ము చేసుకునేందుకు కెనడా పావులు కదుపుతోంది. ట్రంప్ సర్కార్ హెచ్1వీసా ఫీజు పెంపు నిర్ణయం తర్వాత అమెరికన్ కంపెనీలు స్థానికులను నియమించుకునేందుకు మొగ్గు చూపుతుండటంతో భారతీయులకు ఇబ్బందులు తప్పడం లేదు.

Canada opens doors to US H-1B talent amid steep American visa fee row

ఇప్పుడు అలాంటి వారికి కెనడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భారీ ఊరటనిస్తుందని భావిస్తున్నారు. కెనడా ప్రభుత్వ నిర్ణయం దేశవ్యాప్తంగా ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే కీలకమైన పరిశ్రమలలో శ్రామిక శక్తి కొరతను అధిగమించేందుకు ఉపయోగపడనుంది. రెండు నెలల క్రితమే కెనడా ప్రధానమంత్రి మార్క్ ఒట్టావా ట్రంప్ హెచ్1బీ వీసాదారులపై విధించిన ఏడాదికి లక్ష డాలర్ల ఫీజును నైపుణ్యం కలిగిన కార్మికులను ఆకర్షించే అవకాశంగా తాము చూస్తున్నట్లు తెలిపారు. అమెరికాలో అంత మంది హెచ్1బీ వీసాదారులకు వీసాలు లభించవు. వీరు నైపుణ్యం కలిగిన వ్యక్తులని, కెనడాకు ఒక అవకాశమని ప్రధాని కార్నీ తెలిపారు. వీరికి తాము ఆఫర్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. దీనికి అనుగుణంగానే ఇప్పుడు ఆదేశాలు ఇచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+