Cannes Film Festival 2023:రెడ్ కార్పెట్ పై దర్శనమివ్వనున్న బ్యూటీస్ జాబితా ఇదే..!
మరికొన్ని గంటల్లో ప్రతిష్టాత్మక కాన్స్ ఫిలిం ఫెస్టివల్ 76వ ఎడిషన్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఫ్రాన్స్‌లో జరిగే ఈ మెగా ఈవెంట్‌కు ప్రపంచ నలుమూలల నుంచి నటీనటులు, దర్శకులు, నిర్మాతలు సాంకేతిక నిపుణులు హాజరవుతారు. ఈ వేడుకల్లో రెడ్ కార్పెట్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ సారి రెడ్ కార్పెట్ ఈవెంట్‌కు భారత్ నుంచి ఎవరు ప్రాతినిథ్యం వహిస్తున్నారు, తొలిసారిగా ఎవరిని ఈ అదృష్టం వరించనుందో తెలుసుకుందాం.

కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ఎప్పుడూ ప్రత్యేకత చాటుకునేది రెడ్ కార్పెట్. ఈ స్పెషల్ ఈవెంట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఎందుకంటే ఇందులో చాలామంది అందాల ముద్దుగుమ్మలు రెడ్ కార్పెట్ పై తమ అందాలను ఒలకబోస్తారు. ఈ అందాలను చూసేందుకు రెండు కళ్లు చాలవంటే నమ్మండి. ఇక ఇటు హాలీవుడ్ స్టార్స్‌తో పాటు భారత్ నుంచి కూడా పలువురికి శాశ్వత ఆహ్వానం ఉంది. ఇక ఈ సారి తొలిసారిగా బాలీవుడ్ భామలు రెడ్ కార్పెట్ పై అందాలతో రెచ్చిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు.

భారత్ నుంచి సెలబ్రిటీలు:
మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ ఈ సారి రెడ్ కార్పెట్ పై మెరవనుంది. ఈమెతో పాటు ఈషా గుప్తా,ఆస్కార్ విజేత గునీత్ మోంగా, కుమార్ సాను కుమార్తె షానన్‌లు దర్శనమివ్వనున్నారు. విరాట్ కోహ్లీ భార్య నటి అనుష్క శర్మ కూడా కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో తొలిసారిగా కనిపించనుంది.

సారా అలీఖాన్ కూడా రెడ్ కార్పెట్ పై తొలిసారిగా వాక్ చేయనుంది.అనేక్ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా సరసన నటించిన ఆండ్రియా కెవిచూసా స్పెషల్ అట్రాక్షన్‌గా కాన్స్‌లో కనువిందు చేయనుంది.ఆమె నాగాలాండ్ తరపున ప్రాతినిథ్యం వహిస్తోంది. వీరికితోడు ఎప్పటిలాగే ఐశ్వర్య రాయ్, అదితీరావు హైదరీలు ఈవెంట్‌లో వావ్ అనిపించనున్నారు.

కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్జర్ డాలీ సింగ్ కూడా తొలిసారిగా రెడ్ కార్పెట్ పై దర్శనమివ్వనుంది. ఇన్స్‌టాగ్రామ్ వేదికగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ చిత్రం కెన్నెడీ కాన్స్ ఫెస్టివల్‌కు సెలెక్ట్ అయినందున ఆయన కూడా హాజరవుతారని తెలుస్తోంది. భారత చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణతో భవిష్యత్తులో మన దర్శకులు తమ టాలెంట్‌ను అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించేందుకు మంచి అవకాశం అని చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications