Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Venezuela: అమెరికా కస్టడీలో మదురో దంపతులు-ఏం చేస్తారో చెప్పేసిన ట్రంప్ సర్కార్..!

అమెరికాను కొంతకాలంగా చికాకుపెడుతున్న డ్రగ్ కార్డెల్స్ పై అధ్యక్షుడు ట్రంప్ ఉక్కుపాదం మోపారు. వెనెజులా కేంద్రంగా సాగుతున్న డ్రగ్ కార్టెల్స్ పై ఇవాళ భీకర దాడులు నిర్వహించారు. అంతే కాదు ఏకంగా వెనెజులా అధ్యక్షుడిని, ఆయన భార్యను సైతం అమెరికా డ్రాగన్ ఫోర్స్ కస్టడీలోకి తీసుకుంది. ఈ విషయాన్ని నేరుగా డొనాల్డ్ ట్రంప్ బయటపెట్టారు. అంతే కాదు ఇప్పుడు వారిని ఏం చేయబోతున్నారో కూడా ట్రంప్ సర్కార్ చెప్పేసింది.

డ్రగ్ కార్టెల్స్ ను ప్రోత్సహించడం, తీవ్రవాదం వంటి ఆరోపణల నేపథ్యంలో ఇవాళ అమెరికా అదుపులోకి తీసుకున్న వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫోర్స్ ను న్యూయార్క్‌ కోర్టులో హాజరుపర్చి జైలుకు పంపేందుకు ట్రంప్ సర్కార్ సిద్దమవుతోంది. వీరిద్దరూ డ్రగ్స్, తీవ్రవాదంపై క్రిమినల్ అభియోగాలను ఎదుర్కొంటారని యుఎస్ అటార్నీ జనరల్ పామ్ బోండి ఎక్స్ లో పెట్టిన పోస్టులో వెల్లడించారు.

Captured Maduro to Face US Drug amp amp Terror Charges

ఈ జంట త్వరలో అమెరికన్ కోర్టులలో అమెరికన్ గడ్డపై అమెరికన్ న్యాయం యొక్క పూర్తి ఆగ్రహాన్ని ఎదుర్కుంటారని యూఎస్ అటార్నీ జనరల్ బోండి వెల్లడించారు. నికోలస్ మదురోపై నార్కో-టెర్రరిజం కుట్ర, కొకైన్ దిగుమతి కుట్ర, మెషిన్‌గన్‌లు , విధ్వంసక పరికరాలను కలిగి ఉండటం, అమెరికాకు వ్యతిరేకంగా మెషిన్‌గన్‌లు, విధ్వంసక పరికరాలను కలిగి ఉండడం ద్వారా కుట్రకు పాల్పడ్డానే అభియోగాలు మోపినట్లు ఆమె తెలిపారు.

Captured Maduro to Face US Drug amp amp Terror Charges

ట్రంప్ ఇవాళ వెనెజులాపై దాడికి ముందే పదే పదే అక్కడ నార్కో-టెర్రరిస్ట్ ప్రభుత్వం ఉందంటూ ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇవాళ దాడి తర్వాత పెట్టిన పోస్టులో.. అమెరికా వెనెజులాపై, దాని అధ్యక్షుడు నికోలస్ మదురోపై భారీ దాడిని విజయవంతంగా చేపట్టినట్లు వెల్లడించారు. అనంతరం ఆయనతో పాటు భార్య సిలియాను వెనెజులా నుంచి తరలించినట్లు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మదురో దంపతుల్ని అమెరికా కోర్టులో ప్రవేశపెట్టి అరెస్టు చూపించే అవకాశాలున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+