దేవయానిపై కేసు బలంగా ఉంది, వెనక్కి లేదు: అమెరికా
న్యూయార్క్: దౌత్యవేత్త దేవయాని కోబ్రాగాదే ఇంటి పనిమనిషి వేతనం విషయం విసా దరఖాస్తులో తప్పు పడిందనే భారత వాదనను అమెరికా తోసిపుచ్చింది. అందులో ఏ విధమైన తప్పు లేదని, కేసు బలంగా ఉందని స్పష్టం చేసింది. దేవయానిపై వీసా ఫ్రాడ్ కేసును ఉపసంహరించుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది.
దేవయానిపై కేసు నడుస్తుందని, దాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తి లేదని అమెరికా సంబంధిత వర్గాలు అంటున్నాయి. 39 ఏళ్ల దేవయానికి దౌత్యపరమైన వెసులుబాట్లు అన్నీ ఉంటాయని, దేశం వెలుపల పర్యటించే సౌకర్యం కూడా ఉంటుందని అంటున్నారు.

దేవయాని అమెరికా రావడానికి ఏ విధమైన ఇబ్బందులు లేవని చెబుతున్నారు. అయితే, అమె అరెస్టు తప్పదని, ఆరోపణలపై విచారణ కూడా జరుగుతుందని అంటున్నారు. వీసా దరఖాస్తులో రాసిన 4,500 డాలర్లు దేవయాని వేతనమని, అది పని మనిషి సంగీతా రిచర్జ్‌కు ఇస్తానని హామీ ఇచ్చిన సొమ్ము కాదని దేవయాని తరఫు న్యాయవాది అంటున్నారు.
వీసా దరఖాస్తును చదవడంలో ఫెడరల్ ఏజెంట్ తప్పు చేయలేదని అమెరికా వర్గాలంటున్నాయి. వీసా దరఖాస్తులో ఉద్యోగం ఇచ్చే వ్యక్తి వేతనం ఉండదని, ఉద్యోగం చేయడానికి ఇష్టపడినవారి వేతనం మాత్రమే ఉంటుందని అంటున్నాయి. కోబ్రాగాదే అరెస్టు విషయంలో క్షమాపణ చెప్పే ప్రసక్తి కూడా లేదని స్పష్టం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications